Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అడివి శేష్ కొత్త సినిమా "ఎవరు" పై భారీ హైప్.... మార్కెట్ లెక్కలకు మించిన బిజినెస్ అవుతుందో లేదో డౌట్....!

Category : movies

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ బెంచ్ మార్క్ చేసుకున్న మల్టీ టాలెంటడ్ హీరో అడవి శేష్. క్షణం అనే సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకుని గూఢచారితో సర్ప్రైజ్ హిట్ కొట్టిన అడవి శేష్. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా పాగా వేశారు.ఇక ఈ సినిమాల తరువాత వరుసపెట్టి సినిమాల్లో నటిస్తూ మార్కెట్ పరంగా మంచి కలెక్షన్స్ నే రాబడుతున్నారు. అయితే తాజాగా తన కొత్త సినిమాకి "ఎవరు" అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ కమర్షియల్ అంశాలకు దూరంగా కొత్తగా ట్రై చేస్తాడని పేరుంది కాబట్టి ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా పై కొంత ఆసక్తి నెలకొంది . అయితే దీన్నే క్యాష్ చేసుకునే పనిలో ఉన్న శేష్ ఎవరు సినిమాకి ఎక్కువ బిజినెస్ ఆశిస్తున్నాడట. శేష్ కున్న మార్కెట్ ఇమేజ్ ని బట్టి కాకుండా చాలా ఎక్కువగా కోట్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికిప్పుడు డీల్ క్లోజ్ చేసేందుకు మొగ్గు చూపకపోవడంతో ఇంకొద్ది రోజులు వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు వినికిడి. గూఢచారి మంచి విజయం సాధించిన మాట వాస్తవమే కానీ దానికి చాలా కారణాలు ఉన్నాయి.

తక్కువ బడ్జెట్ రీజనబుల్ రేట్స్ కి బిజినెస్ చేయడం శశికిరణ్ తిక్కా దర్శకత్వ ప్రతిభతో పాటుగా శేష్ ప్రెజెన్స్ హెల్ప్ అయ్యాయి. అంతే తప్ప ఏ ఒక్క ఫ్యాక్టర్ తోనో ఆడిన సినిమా కాదది.దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఎవరుకి చాలా ఎక్కువ ఆశించడం అత్యాశని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. నిర్మాత పివిపినే అయినప్పటికీ ఈ వ్యవహారాలన్నీ శేష్ చూసుకుంటున్నాడట. ఓవర్ కాన్ఫిడెన్స్ తో గూఢచారిని చూపించి స్టార్ హీరోలా ఫీలైపోయి అంత డిమాండ్ చేయడం సబబు కాదని ఇంకో నాలుగైదు సినిమాలు ఇదే స్థాయిలో ఆడితే అప్పుడు డిమాండ్ చేయొచ్చు కానీ ఇప్పుడు మాత్రం తొందరపడుతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ అఫీషియల్ గా మీడియా కంట్లో పడేవి కాదు కాబట్టి ఎక్కువ హై లైట్ అవ్వడం లేదు కాని ఈ టాపిక్ మీద చర్చలైతే జోరుగా సాగుతున్నాయి. ఆగస్ట్ 23 ప్లాన్ చేసిన ఎవరు ఏకంగా సాహోకు కేవలం వారం రోజుల గ్యాప్ తో వస్తోంది.

Related News