//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గోరఖ్‌పూర్ లో చిన్నారుల మృతిలో వెల్లడవుతున్న ఆదిత్యనాధ్ నిర్లక్ష్యం !

Category : national

దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రి ఆక్సిజన్ అందక ఐదారు రోజులలో 70 మంది వరకు చిన్నారులు మృతి చెందిన సంఘటనలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ `నిర్లక్ష్యం'కు సంబంధించిన బలమైన ఆధారాలు వెల్లడి అవుతున్నాయి.

మెదడువాపు వ్యాధుల వల్లన బాలలు మృతి చెందడం చాలాకాలంగా జరుగుతున్నది అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమర్ధించుకొనే ప్రయత్నం చేసినా, ఈ సమస్య గురించి పూర్తి అవగాహన కలిగిన ముఖ్యమంత్రి తాను అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న చర్యలు కనిపించక పోవడం స్పష్టం అవుతున్నది.

2003 నుండి 2014 వరకు - ముఖ్యంగా యూపీఎ హయాంలో కనీసం 20 సార్లు ఈ సమస్యను పార్లమెంట్ లో ప్రస్తావించిన యోగి కేంద్రంలో నరేంద్ర మోదీ  ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఎందుకు పట్టించుకోలేదో అర్ధం కావడం లేదు. గోరఖ్‌పూర్ ప్రాంతంలో చిన్నారులు చనిపోతూ ఉండడాన్ని పదే పదే ఆయన పార్లమెంట్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. ఐఐఎంఎస్ స్థాయిలో బిఆర్డీ ఆసుపత్రిని అభివృద్ధి చేయడం కోసం తగు మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా కోరుతూ వచ్చారు. ఈ సమస్యపై పదేళ్లలో 8 సార్లు ప్రశ్నలు వేయగా, మరో 12 సార్లు ప్రత్యేక ప్రస్తావన ద్వారా మాట్లాడారు.

పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో మెదడువాపు వ్యాధి మొదటిసారిగా 1979లో ప్రత్యక్షం కాగా, క్రమంగా బీహార్ కు కూడా వ్యాపించిన్నట్లు చెప్పారు. అయితే వాజపేయి హయాంలో క్రమంగా టీకాలు వేస్తూ ఈ వ్యాధిని అదుపులోకి తెచ్చారని, యూపీఎ హయాంలో టీకాలు స్వస్తి పలికారని నిందించారు కూడా.

యోగి పార్లమెంట్ లో చేసిన ప్రసంగాల మేరకు 2004లో దేశంలో 12 రాష్ట్రాలలో 367 మంది మెదడు వాపు వ్యాధితో చనిపోగా, యూపీ లోనే 228 మంది చనిపోయారు. 2005లో మొత్తం దేశంలో జరిగిన 1,682 మరణాలలో 1,500 యుపిలో జరిగాయి. జనవరి మధ్యలో వర్షాలు ప్రారంభమైన తరువాత అక్టోబర్, నవంబర్ నెలల వరకు అంటువ్యాధి వలే కొనసాగుతున్నదని చెప్పారు.

ఇంతటి ప్రమాదకరమైన వ్యాధి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి కూడా స్థానిక యంపీగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడాయిన తరువాత కనీసం టీకాలు వేయించి కృషి కూడా చేయక పోవడం, ముఖ్యమంత్రి పదవి చేపట్టి నాలుగు నెలలవుతున్నా ఈ విషయమై దృష్టి సారించక పోవడం ఆయన నిర్లక్ష్య ధోరణిని వెల్లడి చేస్తున్నది.