//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సినీ ప‌రిశ్ర‌మ చీక‌టి భాగోతాలు.. అదితిరావు చెప్పిన నిజాలు వింటే..!

Category : movies

సౌత్ క్రియేటివ్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చెలియా చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అయ్యింది.. అదితిరావు హైదరి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో సుధీర్ బాబు సరసన నటిస్తోంది. ఈ నెల 15న‌ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అదితిరావు మీడియాతో మాట్లాడారు. అమె ఫ్యామిలికి సినిమాల గురించి ఏమి తెలియదు అన్నారు. పద్మావతి, చెలియా సినిమాల్లో పాత్రలకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు.

ఇక ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఆడవారు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ పై అదితి స్పందిస్తూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది నూరు శాతం ఉందని.. అయితే అది కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే కాదు అని.. అన్ని చోట్ల ఉండని తెలిపింది. మన ప్రవర్తన, జీవన విధానం, అవతలివారితో మాట్లాడేమాటలను బట్టి అది ఆధారపడివుంటుందని అన్నారు. అయితే అటువంటివి పట్టించుకోకుండా ప్రతిఒక్కరు తమకు అవకాశాలు దక్కిన మేరకు వినియోగించుకుని ముందుకు సాగితే ఎటువంటి సమస్యలు ఉండవని అన్నారు.

నిజానికి తనకు ఈ ఏడేళ్లలో అటువంటిది ఎదురుకాలేదని, బహుశా తాను మంచి నటులు, దర్శకులు, బ్యానర్ లలో పనిచేయడం వల్ల ఆ పరిస్థితి ఎదురుకాకపోయి ఉండవచ్చన్నారు. అయితే ప్రతి మహిళా ఇటువంటి దురాచారాలను ఎదుర్కోవాలని, ఆత్మస్థైర్యం, తెగింపు ఉంటేకానీ ప్రస్తుత సమాజంలో ఆడవారు బ్రతికే పరిస్థితి లేదని ఆమె అన్నారు. ఇక ఈ చిత్రంలో తాను ఒక నటి పాత్ర పోషిస్తున్నానని,అంతే కాక తనకు తానే స్వయంగా తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నట్లు అదితి చెప్పుకొచ్చారు.