//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరో విషాదం : ప్రముఖ నటి ఆత్మహత్య

Category : movies

శ్రీ దేవి మృతి చెంది కొన్నాళ్ళు కూడా గడవక ముందే ఇప్పుడు కోల్‌కతాలో ఓ టీవీ నటి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

మౌమిత సాహా అనే నటి నగరంలోని రేజెంట్‌ పార్క్‌ సమీపంలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు పోలీసులు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆమె నిన్నటి మ‌ధ్యాహ్నం నుంచి తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు ఫోన్‌ చేశారు. దీంతో పోలీసులు వచ్చి తలుపులు తెరిచి చూడగా గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు‌ ఆమె మృతదేహం కనిపించింది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

ఇంట్లో ఆత్మహత్యకు సంబంధించి ఆమె రాసిన ఒక లేఖ కనిపించినట్లు చెప్పారు. ఆమె తీవ్రమైన ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సోషల్‌మీడియాలో ఆమె ఖాతాను పరిశీలించగా.. చివరిగా ఆమె పెట్టిన పోస్ట్‌ మానసిక ఒత్తిడితోనే రాసినట్లు కనిపించిందని చెప్పారు. ఆమె ఫోన్‌ కాల్స్‌ను కూడా పరిశీలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వయసు 23 సంవత్సరాలు. కేసు దర్యాప్తులో ఉందని, త్వరలోనే ఆమె మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.