//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

క్యాస్టింగ్ కౌచ్ మీద సంచలన విషయాలు బయట పెట్టిన శ్రీ రెడ్డి !

Category : movies

కాస్టింగ్ కౌచ్ గురించి ఒకప్పుడు మాట్లాడాలంటే హీరోయిన్ లు భయపడే వాళ్ళు కాని ఇప్పుడు పరిస్థితి మారింది.

ఈ విషయం ఇప్పటికే అనేకమంది హీరోయిన్లు ప్రస్తావించారు.. అర్చన, కస్తూరి, గాయత్రి గుప్తా, మాధవిలత ఇలా ఎంతోమంది హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నిలదొక్కుకోవాలన్నా, మంచి మంచి పాత్రలు దక్కాలన్నా ఖచ్చితంగా అన్నింటికీ (క్యాస్టింగ్ కౌచ్) సిధ్ద పడితీరాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు.

తాజాగా కాస్టింగ్ కౌచ్ పై ఇంతకుముందు ఏ నటీ మాట్లాడలేనంతటి సంచలన ఆరోపణలు చేశారు శ్రీరెడ్డి. శ్రీరెడ్డి గా వెండితెరకు పరిచయమైన విమల మల్లిడి జిందగీ, నేను నాన్న అబద్దం, అరవింద్ 2 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఆమెకి అరవింద్ 2 సినిమా కొంచెం పెఉ తెచ్చిపెడుతుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆవేశపూరితంగా సమాధానమిచ్చింది శ్రీరెడ్డి. ఒక హీరోయిన్ ఎన్నో అవకాశాలతో దూసుకుపోతుందంటే ఖచ్చితంగా పడుకుని తీరాల్సిందేనని ఓ సంచలనాత్మక బాంబు పేల్చింది.

ఒకవేళ అన్నింటికి సిద్దమైనా కూడా అవకాశాలు రాకపోతే ఏదో చిన్న క్యారెక్టర్ తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. మన తెలుగు అమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి పంపిచకపోవడానికి మెయిన్ రీజన్ కాస్టింగ్ కౌచ్ అని ఆమె వెల్లడించింది. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి ఉందని తెలిశాక ఏ అమ్మాయి తల్లిదండ్రులైనా తమ ఆడపిల్లల్ని ఇటు పంపిస్తారా? అంటూ ఇంటర్వ్యూయర్ ని ప్రశ్నించింది. ఒకవేళ మేం అన్నింటికీ సిధ్దమని చెప్పినా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇచ్చేవారు ఎవరంటూ ఆమె ప్రశ్నించింది.

Related News