Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్‌బాస్‌పై నటి సంచలన వ్యాఖ్యలు. పోలీసులకు ఫిర్యాదు!

Category : movies

హైదరాబాద్‌: బిగ్‌బాస్-3 కార్యక్రమ నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్‌-3కి తనను ఎంపిక చేసి అగ్రిమెంట్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేశారంటూ శ్వేతారెడ్డి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ కార్యక్రమ బాధ్యులు తనను మోసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.'బిగ్‌బాస్‌' సీజన్‌ 3 ఈనెల 21 నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలను ఇప్పటికే ఎంపిక చేసినట్లు సమాచారం. ఈసారి అగ్ర కథానాయకుడు నాగార్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన రియాల్టీ షో బిగ్ బాస్. ఈ నేపథ్యంలో శ్వేతారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.