Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నటి రేణు దేశాయ్ లో కొత్త కోణం..... నువ్వు ఓ అమ్మకే పుట్టి ఉంటావు కదా....?

Category : movies

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన "బద్రి" సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.....ఆ తరువాత ఏకంగా ఆ సినిమా హీరో తోనే ప్రేమలో పడి... పెళ్లి కూడా చేసుకున్న భామ రేణు దేశాయ్. సుమారు పదేళ్లకు పైగా ఒక్కటిగా కాపురం చేసిన ఈ ఇద్దరు ఆ తరువాత కొన్ని మనస్పర్ధలు కారణంగా పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ తో విడాకులు తీసుకోవడం జరిగింది. అయినప్పటిికి పవన్ మాజీ భార్యగానే ఆమె ను ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. పవన్ తో విడాకులు తరువాత కొన్నాళ్ల వరకు నార్త్ లోనే ఉన్న ఈమె. ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకు టచ్ లో ఉంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలమే అయినా ఇంకా ఆమెను ‘మాజీ భార్య’గానే చాలా మంది సంబోధిస్తున్నారు. ఇలా ఆమెను పిలవడం ఆమెకు ఏ మాత్రం నచ్చడంలేదట.

ఒంటరిగా తన కాళ్ళ తాను బ్రతుకుతున్న ఇంకా ఆ బ్రాండ్ తో పిలవడం తన మనో దైర్యన్ని దెబ్బ తీస్తుందని ఆమె అభిప్రాయం, ఆసహనం.ఇంతకాలం, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులతో యుద్ధమే చేసిన రేణు దేశాయ్.. తొలిసారి ఒక ఫిల్మ్ న్యూస్ వెబ్‌సైట్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఫాదర్స్ డే సందర్భంగా ఆమె అందరికీ శుభాకాంక్షలు చెబితే...... దాన్ని కూడా పవన్ కళ్యాణ్‌కు ముడిపెడ్డటాన్ని రేణు దేశాయ్ తట్టుకోలేక పోతుంది.. అందుకే తన పై ఇలాంటి ఉచిత ప్రచారం చేస్తూ తన సంతోషాన్ని దెబ్బ తీస్తున్న వారి పై తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఏకి పారేసింది..అసలు విషయం ఏమిటి అంటే. ఆదివారం ఫాదర్స్ డేను పురష్కరించుకుని రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది.ఈ పోస్ట్ లో ‘'తండ్రులందరికీ..... ఒంటరిగా ఉంటోన్న తల్లులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు'’ అని రేణు దేశాయ్ పేర్కొన్నారు.

అలాగే, శ్రీనగర్‌లోని హజరత్‌బల్ దర్గా వద్ద తన పిల్లలతో తీసుకున్న ఫొటోను రేణు ఈ పోస్ట్‌లో పొందుపరిచారు.ఇంత వరకు బాగానే ఉంది కానీ. ఈ ఫొటోను ఉపయోగిస్తూ సదరు సదరు ఫిల్మ్ న్యూస్ వెబ్‌సైట్ తన ట్విట్టర్ ఖాతాలో పెడుతూ..... పవన్ కళ్యాణ్ మాజీ భార్యతో ఆయన పిల్లలు అని క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ ట్వీట్‌ చూసిన రేణు దేశాయ్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ‘ఇప్పుడే ఎవరో నాకు ఇది పంపించారు. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఒక తల్లికే పుట్టి ఉంటాడు. ఒక తల్లిని ఇలా బాధ పెట్టడం సరైన పద్దతి కాదంటూ ఆమె పేర్కొన్నది.అంతే కాకుండా ఈ ఫేస్‌బుక్‌ పోస్ట్ లో ఆమె ఎంతో ఎమోషనల్ అయ్యింది.ఈ లెక్కన ఇక పై తన గురించి కానీ తన పర్సనల్ లైఫ్ గూర్చి కానీ ఎవరైనా ఇలా చేస్తే ఆమె ఇక పై ఎంత మాత్రం ఉపక్షించే స్థితిలో లేనట్టున్నారు.అందుకే ఇంత తీవ్ర స్థాయిలో రియాక్టు అయ్యారు.