రేఖ ప్రముఖ భారతీయ నటి.రేఖ అసలు పేరు భానురేఖా గణేషన్.సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన తరువాత ఆమె పేరును రేఖ గా మార్చుకొన్నారు.రేఖ 10 అక్టోబరు 1954 లో ప్రముఖ తమిళ నటుడు జెమిని గణేషన్ మరియు తెలుగు నటి పుష్పవల్లి లకు చెన్నైలో జన్మించింది.
నటునిగా ఆమె తండ్రి ఎన్నో విజయాలను ఆస్వాదించాడు మరియు రేఖ కూడా అతని అడుగు జాడలలోనే నడిచింది.ఆమె తల్లితండ్రులకు వివాహము జరుగలేదు, మరియు ఆమె చిన్నతనంలో అతను తన పితృత్వాన్ని అంగీకరించలేదు.1970లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోయే ముందు ఆమె తన పుట్టు పూర్వోత్తరాలు వెల్లడించింది. తరువాత, తను వృత్తిలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తండ్రి యొక్క నిరాదరణ ఇంకనూ ద్వేషాన్ని కలిగిస్తోందని మరియు అందుచేత సయోధ్య యత్నాలను ఆమె పట్టించుకోవటం లేదని తెలిపింది.
ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన, మరీ ముఖ్యంగా మహిళా ప్రాధాన్యతగల చిత్రాలు ఖూబ్ సూరత్ లోని పాఠశాల విద్యార్థిపాత్ర మరియు ఖూన్ భరీ మాంగ్ లోని నిష్కర్షయైన ప్రతీకారపు స్త్రీ వంటి పాత్రల ద్వారా రేఖ గుర్తింపు పొందినది, ఈ రెండు చిత్రాలు ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును తెచ్చిపెట్టాయి. ఉమ్రావ్ జాన్ లోని దేవదాసి పాత్ర పోషణకు గాను ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ చలన చిత్ర అవార్డు లభించింది. 1970 దశాబ్దమంతా మరియు తరువాతి కాలంలో ఆమె భారతీయ చిత్ర మాధ్యమంలో శృంగార నాయకి గా గుర్తింపు పొందింది.
ఆమె 1990లో వివాహం చేసుకుంది.ఆమె భర్త 1991లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.1973లో ఆమె నటుడు వినోద్ మెహ్రాను వివాహము చేసుకుందని ప్రచారం జరిగింది, కానీ 2004న దూరదర్శన్ లో సిమీ గరేవాల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వివాహంపై వచ్చిన వదంతులను త్రోసిపుచ్చి, అతనిని ఒక శ్రేయోభిలాషి గా అభివర్ణించింది. రేఖ ప్రస్తుతము ముంబై లోని బాంద్రా హోమ్ లో ఒంటరిగా నివసిస్తోంది.
రేఖ తన 40 సంవత్సరాల వృత్తి జీవితంలో 180 కి పైగా చిత్రాలలో నటించింది. ఎన్నోసార్లు ఆమె తన వృత్తిలో తిరిగి నిలదొక్కుకొని తన స్థానాన్ని నిలబెట్టుకోవటంలో ప్రతిభ కనబరచింది. భారత దేశంలో సమాంతర సినిమా అని పిలవబడే కళాత్మక చిత్రములు మరియు ప్రధాన భారతీయచిత్రాలు రెండింటిలో నటించి ఆర్థికంగా విజయం సాధించటంతో పాటు సంవత్సరాల తరబడి నటించిన ఎన్నో చిత్రాలకు విమర్శకుల ప్రశంసలు పొందింది.
రేఖ బాల నటిగా తెలుగు చిత్రం రంగుల రాట్నం (1966) లో కనిపించింది. రేఖ, 1969లో విజయవంతమైన కన్నడ చలనచిత్రం గోదల్లి CID 999లో డా. రాజ్ కుమార్ సరసన నాయికగా రంగప్రవేశం చేసింది. అదే సంవత్సరం ఆమె తన మొదటి హిందీ చిత్రం, అంజానా సఫర్ లో నటించింది.
1990వ దశకం రేఖ యొక్క విజయాలలో ఒక పతనాన్ని చూసింది మరియు ఆమె క్రమముగా తన యొక్క కీర్తిని కోల్పోయింది. ఆమె ఎన్నో సవాళ్ళు గల పాత్రలు చేయటానికి బదులు, వాణిజ్య పరంగా మరియు విమర్శనాత్మకంగా అపజయం పాలైన అనేక చిత్రాలలో నటించింది. ఆమె తరంలోని నటీమణులయిన హేమమాలిని మరియు రాఖీ వారి చిత్రములలో తల్లి లేదా అత్త వంటి సహాయక పాత్రలను పోషించటం మొదలుపెట్టినప్పటికీ, రేఖ వారికి విరుద్ధంగా మాధురి దీక్షిత్ మరియు రవీనా టాండన్ వంటి నటీమణులు ఉన్నత దశలో ఉన్న సమయంలో కూడా, ప్రధాన పాత్రలను పోషించింది అని విమర్శకులు గుర్తించారు