Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నటి ఝాన్సీ ఆత్మహత్యపై సంచలన విషయాలు వెల్లడించిన సూర్య

Category : state

బుల్లి తెరనటి ఝాన్సీ ఆత్మహత్య కేసు దర్యాప్తు ను పోలీసులు వేగవంతం చేస్తున్నారు. ఝూన్సీని పెళ్లి చేసుకుంటానని చెప్పి సూర్య మోసం చేశాడని ఝూన్సీ తల్లి పోలీసులకు తెలిపింది. ఝూన్సీ తల్లి, సోదరుడు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఝూన్సీ ప్రియుడు సూర్య తేజను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఝూన్సీ సూర్యల మధ్య నడిచిన ప్రేమ వ్యవహారం పై పోలీసులు విచారణ చేపట్టారు. వారిమధ్య జరిగిన విషయాలపై సూర్య నుంచి సమాధానాలు రాబడుతున్నారు.

టీవీ సీరియల్ నటి నాగఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు క్రమంగా వేగం పెంచుతున్నారు. ఈ కేసులో బాబి, గిరిని అనే ఇద్దరు ఫొటోగ్రాఫ్ర్లను కూడా అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు సమాచారం. ఝాన్సీ ఆత్మహత్య కేసులో పలువురిని విచారించిన పంజాగుట్ట పోలీసులు.. నాగఝాన్సీ ప్రియుడు సూర్యతేజను మరోసారి విచారించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సూర్యతేజ పోలీసులకు ఝాన్సీ ఆత్మహత్యకు గల కారణాలను చెప్పుకొచ్చినట్టు సమాచారం. 'ఝాన్సీకి గిరి,బాబి అనే ఇద్దరు ఫొటో షూట్ చేసేవారు. ఆ ఇద్దర్నీ నమ్మొద్దని పలుమార్లు ఝాన్సీ కి చెప్పాను.సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తామని ఆమెను మోసం చేశారు.గిరి పలుమార్లు ఇబ్బంది పెట్టాడని ఝాన్సీకి నాకు పలుమార్లు చెప్పింది. దీంతో గిరికి నేను ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చాను. సినిమా ఆఫర్లు తగ్గడంతోనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది' అని పోలీసు విచారణలో సూర్యతేజ చెప్పినట్టు తెలుస్తోంది.

సూర్య వద్ద ఉన్న 2 మొబైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఝాన్సీ ప్రియుడు సూర్య ఇదివరకే మధు అనే సీరియల్‌ నటితో ప్రేమ వ్యవహారం నడిపాడని, ఆ తర్వాత మధుకు బ్రేకప్‌ చెప్పిన సూర్య, ఝాన్సీని ప్రేమించినట్లు తెలుస్తోంది. మధు సహాయంతోనే అతడు ఝాన్సీని ట్రాప్‌ చేశాడని సమాచారం. ఝాన్సీ సూర్య పుట్టిన రోజు కానుకగా రెండు లక్షలు విలువ చేసే బైక్‌ను, ఆ తర్వాత 10 లక్షల రూపాయలు విలువచేసే బంగారు నగలను సైతం అతడికి ఇచ్చినట్లు సమాచారం.