//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

galleries Jayasudha Movies : జయసుధ సినిమాలు : Actress jayasudha husband photos family images videos marriage galleries children bio data

Category : editorial

సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత. 1959 డిసెంబర్ 17న మద్రాస్ లో జన్మించారు. పుట్టి పెరిగినది మద్రాసులో అయినా మాతృభాష తెలుగే. నటి, నిర్మాత విజయనిర్మల ఈవిడకు మేనత్త .

1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం జయసుధ మొదటి చిత్రం. జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి.

జయసుధ 1985లో ప్రముఖ హిందీ నటుడు జితేంద్రకు దాయాది అయిన నితిన్ కపూర్ను పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. 1986 లో మొదటి కొడుకు నిహార్ మరియు 1990 లో శ్రేయంత్ పుట్టారు.

2001లో జయసుధ బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మతస్థురాలైనారు. ఇటీవల అనారోగ్యముతో బాధపడుతూ వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును కూడా ప్రారంభించారు. 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు ఎమ్.ఎల్.ఏగా గెలిచారు.జయసుధ భర్త నితిన్‌ కపూర్‌(58) ఆత్మహత్య చేసుకొని చని పోయాడు.

పురస్కారములు ;

ఫిల్మ్ ఫేర్ ;

ఉత్తమ నటి (తెలుగు) – జ్యోతి (1976)

ఉత్తమ నటి (తెలుగు) – ఆమె కథ (1977)

ఉత్తమ నటి (తెలుగు) – గృహప్రవేశం (1982)

ఉత్తమ సహాయనటి (తెలుగు) – అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి (2004)

ఉత్తమ సహాయనటి (తెలుగు) – కొత్తబంగారు లోకం (2008)

జీవన సాఫల్య పురస్కారం (దక్షిణ భారత) (2010)

నంది పురస్కారాలు ;

ఉత్తమ నటి – జ్యోతి (1976)

ఉత్తమ నటి – ఇది కథ కాదు (1979)

ఉత్తమ నటి – ప్రేమాభిషేకం (1981)

ఉత్తమ నటి – మేఘసందేశం (1982)

ఉత్తమ నటి – ధర్మాత్ముడు (1983)

ఇతర పురస్కారములు;

కళాసాగర్ - ఉత్తమ నటి – మేఘసందేశం (1982)

భారత సినిమా గౌరవ పురస్కారం - (2007)

ఆంధ్ర ప్రదేశ్ చలనచిత్ర సంఘం – జీవన సాఫల్య పురస్కారం (2008)

అక్కినేని నాగేశ్వరరావు జీవన సాఫల్య పురస్కారం (2008)