//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Jaya Prada Movies : జయప్రద సినిమాలు : Actress jayaprada husband photos family images videos marriage galleries politician

Category : editorial

తెలుగు సినీరంగములో జయప్రద లేదా జయప్రద నహతాగా పరిచితురాలైన లలితారాణి ప్రముఖ నటి మరియు పార్లమెంటు సభ్యురాలు. జయప్రద 1962 ఏప్రిల్ 3 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ మరియు నీలవేణి దంపతులకు జన్మించింది.

జయప్రదకు బాల్యములో డాక్టరు అవ్వాలని కోరిక ఉండేది. ఈమె తల్లి ఈమెను ఏడవఏటి నుండే నాట్య సంగీత శిక్షణకు పంపినది. తన తండ్రి మరియు బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీరంగ ప్రవేశము వారిద్వారా లభించలేదు.

14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను కనుగొన్నాడు. ప్రభాకరరెడ్డి ఈమెకు జయప్రద అని నామకరణము చేసి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం చేశాడు.

అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో (తెలుగు, తమిళం, మలయాళము, కన్నడ, హిందీ మరియు బెంగాలి) 300కు పైగా సినిమాలలో నటించింది.

పాఠశాల తర్వాత ఈమె రాజమండ్రిలోని రాజలక్ష్మి మహిళా కళాశాలలో చదివినది. ఈమె 1986 జూన్ 22 న సినీనిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహమాడినది.

నందమూరి తారక రామారావు ఆహ్వానముతో 1994 అక్టోబర్ 10 న తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయరంగ ప్రవేశము చేసింది. ఆ తర్వాత ఈమె చంద్రబాబు నాయుడు పక్షములో చేరి తెలుగు దేశము పార్టీ యొక్క మహిళా విభాగమునకు అధ్యక్షురాలైనది.

1996 ఏప్రిల్ లో తెలుగుదేశము పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనది. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన తెలుగు దేశము పార్టీకి రాజీనామా చేసి జయప్రద ములాయం సింగ్ యాదవ్ యొక్క సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదముతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గము నుండి 2004 మే 13 న లోక్ సభకు ఎన్నికైనది.

జయప్రద సినిమాలకు, రాజకీయాలకు సంబంధం లేదని చెప్పారు. జయలలిత మృతి తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందని చెప్పారు. రజనీ, కమల్ హాసన్‌లు రాణిస్తారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. తన రాజకీయ పునరాగమనం ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తానని చెప్పారు

Related News