//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైఎస్ జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన హీరో విశాల్..!

Category : politics

అభిమ‌న్యుడు చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను సొంతం చేసుకున్న హీరో విశాల్.. ఇటీవ‌ల ఏపీ రైతుల కోసం ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవల విడుదలైన తన అభిమన్యుడు సినిమా ఒక్కో టికెట్‌పై రూపాయి చొప్పున రైతుల కోసమే అంటూ విశాల్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఒక్కో టికెట్‌పై రూపాయి చొప్పున రైతులకు అందించాలని విశాల్ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

అయితే తాజాగా విశాల్ మ‌రోసారి తెలుగు వార్తల్లో నిలిచాడు. అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై విశాల్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏపీకి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డే అనే రితిలీ విశాల్ కామెంట్స్ చేయడం విశేషం. ప్రస్తుతం జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి యాత్ర చేయడం ఏ నాయకుడి వల్ల కాదని విశాలు అన్నారు. ప్రతి ఒక్క గ్రామంకు వెళ్లి.. ప్రతి ఒక్కర్ని పలకరించడం అనేది మామూలు విషయం కాదన్నారు. అందులోను నడుస్తూ ప్రజల సమస్యలు తెలుస్కోని 3వేల కిలోమీట‌ర్లు న‌డిచేందుకు పూనుకోవ‌డం ఎవ‌రి తరం కాదంటూ.. జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌టం సంతోషంగా ఉంద‌ని.. జ‌గ‌న్‌కు హ్యాట్సాఫ్ అంటూ విశాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశారు.