//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అరుంధతిరాయ్‌‌పై ఎంపీ పరేశ్ రావల్ వివాదకర ట్విట్.

Category : national

బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ సరికొత్త వివాదానికి తెరలేపారు. కశ్మీర్లో రాళ్ల దాడి నుంచి కాపాడుకునేందుకు స్థానికుడి బదులు రచయిత అరుంధతీ రాయ్‌ని జీప్‌కు కట్టేయాలని వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ ‘‘రాళ్లు విసిరేవాడి బదులు ఆర్మీ జీప్‌కు అరుంధతి రాయ్‌ని కట్టేయండి’’ అని పోస్టు చేశారు. గత నెలలో ఓ సైనికాధికారి రాళ్ల దాడి నుంచి తప్పించుకునేందుకు ‘‘మానవ కవచంగా’’ ఓ స్థానికుడిని జీప్ ముందు కట్టేసి తీసుకెళ్లడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

కాగా రావల్ ట్వీట్‌తో కాంగ్రెస్‌తో పాటు నెటిజన్లకు కొత్త ఆయుధం దొరికినట్టయింది. ఇదే అదనుగా జమ్మూ కశ్మీర్‌లోని పీడీపీ-బీజేపీ కూటములపై కాంగ్రెస్ మాటలదాడి మొదలుపెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ ‘‘బీజేపీ-పీడీపీలకు చెందిన వ్యక్తిని ఎందుకు కట్టేయకూడదు?’’ అని ట్వీట్ చేశారు. కేవలం ప్రచారం కోసమే కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని కాలమిస్టు శోభాడే, రావల్‌కి కౌంటర్ ఇచ్చారు.