//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈ సారి టార్గెట్ యూత్ ..అంటున్న నమిత..

Category : movies

బిఈ సారి టార్గెట్ యూత్ ..అంటున్న నమిత..ల్లా బాంబు,జెమినీ జిగేలు రాణి నమిత ఈ మద్యే ఓ ఇంటికి కోడలైంది.బొద్దు బొమ్మ ఇక సినిమాల జోలికి రాదన్న అందరికి షాక్ ఇచ్చింది,పెళ్లి తర్వాత నమిత మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది.

ప్రముఖ దర్శక నిర్మాత టి. రాజేంద్రన్ దర్శకత్వంలో ఈ బొద్దుగుమ్మ ఓ లేడీ డాన్‌గా నటించనుంది. యూత్ ఫుల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నమిత స్పెషల్ రోల్ చేయబోతుందంట. ఈ సినిమాకి స్టోరీ,డైరెక్షన్,మ్యూజిక్ తో పాటు కెమెరా మ్యాన్ గా కూడా రాజేంద్రనే చేస్తున్నారంట.

తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కున్న ఈ సినిమాకు ' ఇన్రైయ కాదల్ డా' అనే పేరు పెట్టారు. ఈ సందర్భంగా రాజేంద్రన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో లేడీ డాన్‌గా నమిత నటిస్తోంది.

యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో ఈ సినిమా యూత్‌ని టార్గెట్ చేస్తూ వారిని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించనున్నాం’’ అని తెలిపారు.బొద్దుగుమ్మ ఎలా చేయబోతుందో సినిమాలో చూడాల్సిందే...