//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోహన్ బాబు హౌజ్ అరెస్ట్ ... తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం

Category : state politics

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వైసిపి కి అనుకూలంగా మాట్లాడుతున్న సినీ నటుడు మోహన్ బాబు సరిగ్గా ఎన్నికల సమయంలో కళాశాలలకు ఫీజులు రియంబర్స్మెంట్ చేయని ప్రభుత్వ వైఖరి పైన ధర్నా చేయాలని నిర్ణయించారు. ఏ కారణంతో మోహన్ బాబు ధర్నా చేసినప్పటికీ అది రానున్న ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మోహన్ బాబు ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.

సినీ నటుడు మోహన్ బాబు నిరసనను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుపతిలో మోహన్ బాబును హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉదయం 7 గంటలకు భారీగా విద్యానికేతన్‌కు చేరుకున్నారు. అయితే మోహన్ బాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను నిరసనను కొనసాగిస్తామని చెబుతున్నారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లింపు విషయంలో ఆంధ్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా మోహన్ బాబు ధర్నా చేపడతానన్నారు. ఇప్పటికే ఆ మధ్య ఈ విషయంలో ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. మోహన్ బాబు కుమారుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధిపతి అయిన విష్ణు కూడా బాహాటంగా విమర్శలు చేశారు.

మోహన్ బాబు ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేస్తారని వార్తలు వినిపించాయి. కానీ చేయడం లేదు. ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేస్తారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ధర్నా ఎందుకోసం చేసినా, అది ఎన్నికల ప్రచారం మాదిరిగా ఓటర్ల ఆలోచన మీద ప్రభావం చూపించే అవకాశం మాత్రం వుంది. దీంతో మోహన్ బాబు చేపడుతున్న ధర్నాకు అడ్డుకట్ట వేసేందుకు చంద్రబాబు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పోలీసుల్ని పంపి.. ఆయనను హౌస్ అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Related News