Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నటనకు గుడ్ బై చెప్పిన హీరోయిన్ ఛార్మి....!

Category : movies

ఈ రోజుల్లో హీరోయిన్లు అవ‌కాశాలు వ‌చ్చిన‌న్ని రోజులు న‌టిస్తూనే ఉంటారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌పుడే రిటైర్మెంట్ తీసుకోడానికి ఆలోచించ‌రు.. అవ‌కాశాలు వ‌స్తుంటే క‌నీసం పెళ్లి వైపు మ‌న‌సు మ‌ళ్లించ‌రు. అలాంటిది పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి మాత్రం ఏకంగా న‌ట‌న నుంచి త‌ప్పుకుంది. 30 ఏళ్ల వ‌య‌సులోనే యాక్టింగ్ ఇంక చాలు అని నిర్ణ‌యం తీసుకుంది. 14 ఏళ్ల వ‌య‌సులోనే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ బ్యూటీ.. 16 ఏళ్ల పాటు న‌టించింది.దాదాపు 50 సినిమాల్లో భిన్న పాత్ర‌ల్లో మెప్పించింది. కొన్ని సినిమాల‌కు డ‌బ్బింగ్ కూడా చెప్పింది. ఇలాంటి స‌మ‌యంలోనే ఉన్న‌ట్లుండి సినిమాల నుంచి త‌ప్పుకుంది ఛార్మి.

నాలుగేళ్ల కింద పూరీ తెర‌కెక్కించిన జ్యోతిలక్ష్మి సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ ఛార్మి తెర‌పై క‌నిపించ‌లేదు.. ఇక క‌నిపించ‌న‌ని క్లారిటీ కూడా ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ‌.ఏంటి సినిమాలు చేయ‌డం లేద‌ని అడిగితే.. ఇంకా ఎన్నాళ్ళని హీరోయిన్‌గానే నటిస్తూ ఉంటాను.. ఇంక వేరే చూసుకోవాలి క‌దా అంటూ స‌మాధానం ఇచ్చింది ఛార్మి. ఇప్ప‌టికీ ఎవ‌రో ఒక‌రు త‌మ సినిమాల్లో న‌టించ‌మ‌ని అడుగుతున్నా కూడా తానే వ‌ద్ద‌ని చెబుతున్న‌ట్లు చెప్పింది ఛార్మి. ఇక‌పై నిర్మాతగానే కొన‌సాగనున్న‌ట్లు కన్ఫ‌ర్మ్ చేసింది ఛార్మి. ప్ర‌స్తుతం రామ్ హీరోగా న‌టిస్తున్న ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాకు స‌హ నిర్మాత‌గా ఉంది ఛార్మి.

Related News