//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డీఎస్సీ నిర్వహణకు చర్యలు

Category : editorial

ప్రాథమికంగా 10,603పోస్టులు ఉన్నట్లు అంచనా

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వచ్చే ఏడాది డీఎస్సీ నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని మంత్రి గంటాశ్రీనివాసరావు ప్రకటించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఖాళీల వివరాలను సేకరిస్తోంది.

జిల్లాల వారీగా వివరాలను బుధవారంలోపు పంపించాలంటూ జిల్లా విద్యాధికారులకు ఉత్తర్వులు వెళ్లాయి. ఈ ఏడాది జూన్‌1 వరకు ఉన్న ఖాళీలతోపాటు వచ్చే మూడేళ్లల్లో మే31, 2020వరకు పదవీవిరమణతో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలను కూడా అందించాలని అందులో పేర్కొన్నారు.

పాఠశాల విద్యాశాఖ తన వద్దనున్న వివరాల ప్రకారం 10,603 పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నట్లు అంచనా వేస్తోంది. ఇటీవల పాఠశాలల హేతుబద్దీకరణ, బదిలీలు జరిగిన నేపథ్యంలో ఈ ఖాళీల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో మొత్తం ఖాళీలు -1236

SA , LP , PET, SGT

57  106 15 1108 ,చిత్తూరు జిల్లాలో మొత్తం ఖాళీలు -1606

SA , LP , PET, SGT

221 182 09 1194, YSR కడప జిల్లాలో మొత్తం ఖాళీలు -356

SA , LP , PET, SGT

104  40  06  206 ,కర్నూలు జిల్లాలో మొత్తం ఖాళీలు -730

SA , LP , PET, SGT

122  98  13  497 ,శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఖాళీలు-719 SA , LP , PET, SGT

220 103 21  375,విజయనగరం జిల్లాలో మొత్తం ఖాళీలు -362

SA , LP , PET, SGT

104  33  07  218 ,విశాఖపట్నం జిల్లాలో మొత్తం ఖాళీలు -1187

SA , LP , PET, SGT

307  59  28  793  ,తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఖాళీలు -1215

SA , LP , PET, SGT

192 120 19  884  ,పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం ఖాళీలు -601

SA , LP , PET, SGT

123  84  00  394 ,కృష్ణా జిల్లాలో మొత్తం ఖాళీలు -379

SA , LP , PET, SGT

104  49  13  213 .గుంటూరు జిల్లాలో మొత్తం ఖాళీలు -907

SA , LP , PET, SGT

159  43  23  682 ,ప్రకాశం జిల్లాలో మొత్తం ఖాళీలు -839

SA , LP , PET, SGT

79 16  21  723 ,నెల్లూరు జిల్లాలో మొత్తం ఖాళీలు -416

SA , LP , PET, SGT

57 42  10  307

మొత్తం ఖాళీలు అన్ని జిల్లాలలో

SA , LP , PET, SGT, మొత్తం

1849  975  185  7594  10603