//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నగ్నంగా నటించి మంచి పనే చేశా

Category : movies

ఈ రోజుల్లో యువత ఎక్కువగా పెడదారి పడుతుంది అంటే దానికి ప్రధాన కారణం అశ్లీల వీడియోలే అంటారు నిపుణులు. ముఖ్యంగా శృంగార ప్రధాన వీడియోలు నెట్ లో ఎక్కువగా ఉండటంతో వాటి ఆధారంగా రేప్ ఘటనలు జరగడమే కాకుండా అనేక అనర్ధాలకు కూడా అది కారణంగా మారుతుంది. అయితే యువతలో ఈ ఆలోచనలు పోగొట్టేందుకు గాను తమిళంలో ఒక వినూత్న ప్రయోగం చేసారు. ఎక్స్ వీడియోస్ అనే సినిమాను తెరకెక్కించారు.

దీనిలో ఆకృతి సింగ్ అనే ఒక బెంగాలి భామ నగ్నంగా నటించి మెప్పించింది. ఇది ఆమెకు తొలిసినిమా కావడంతో పలువురు ఆమెపై విమర్శలు గుప్పించారు. తాజాగా దీనిపై ఆమె స్పందించింది. ‘‘బాలీవుడ్‌కి, కోలీవుడ్‌కి చాలా వ్యత్యాసం ఉంది. తమిళంలో నటించడం నాకు బాగా నచ్చింది. అందరూ ఎంతో సహకరించారు.ఒక సామాజిక సమస్యపై ప్రజల్ని జాగృతి చేసే లక్ష్యంతో తీసిన మంచి చిత్రం ఇది. ఇందులో అశ్లీలం లేదు.

కుటుంబంతో సహా చూడొచ్చు. ఆపద గురించి తెలియకుండా మనం సరదాగా ఫోన్‌లో తీసుకొనే వీడియోల వద్ద ఎటువంటి అనర్ధాలు జరుగుతున్నాయో ‘ఎక్స్‌వీడియో్‌స’లో చాలా వివరంగా చూపించారు. అందుకోసమే ఒక సన్నివేశంలో నగ్నంగా నటించేందుకు సిద్ధమయ్యాను. అందుకు బలమైన కారణం కూడా ఉంది. ఆ సన్నివేశంలో నేను నటించలేదంటే.. ఈ సినిమా తీయడంలో అర్ధమే లేదు.

ఒక నటిగా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నించాను. ఇందులో తప్పేమి లేదు. ఈ సినిమా ఖచ్చితంగా మహిళల్లో చైతన్యం తీసుకొస్తుందని నమ్ముతున్నాను. సినిమా చూసిన తరువాత మనకు తెలియకుండానే ఎటువంటి పొరబాట్లు చేస్తున్నామో జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త పడతారు. సమాజంలో చాలామందికి పోర్న్‌ క్రైం గురించి తెలియదు. ప్రజలకి మంచి చేయాలనే ఈ సినిమా తీశాం’’ అని ఆకృతి తనను తాను సమర్ధించుకుంది.