//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అదిరింది భామ్మ

Category : movies editorial

కష్టే ఫలి అన్నారు పెద్దలు , మరి ఇక్కడ ఇష్టే ఫలి అంటుంది భామ్మ , అసలు అనుకోని అర్హతకు ఆనందిస్తుంది, కాలం రాజు ని బిచ్చాడిగిని చెయ్యగలదు , బిచ్చాడిగిని రాజునూ చెయ్యగలదు, ఇప్పుడు ఈదే కాలం ఆరు పదుల భామ్మని మోడల్ చేసింది. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ,నమ్మితీరాల్సిందే. అసలు విషయమేంటంటే ఇద్దరు రిపోర్టర్లు చేసిన చిన్న పొరపాటు ఓ బామ్మ జీవితాన్ని మలుపుతిప్పింది. 63 ఏళ్ల వయసులో ఆమెను ఫ్యాషన్‌ ఐకాన్‌గా.. సెలబ్రెటీగా మార్చేసింది.

అమెరికాలోని న్యూయార్క్‌ కు చెందిన లిన్‌ స్లేటర్‌.. ఆరు పదుల వయసులోనూ తనకు నచ్చిన దుస్తులు వేసుకుంటూ స్టైలిష్‌గా కనిపించేది. ఆమె సోషల్‌ వెల్ఫేర్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసిన లిన్‌.. అదే విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసేది, ఇదంతా గతం ,ప్రస్తుతం లిన్ ఓ పెద్ద మోడల్, ఒక రోజు లంచ్ చేద్దామని ఓ హోటల్ దగ్గర, తాను తన స్నేహితురాలి కోసం వెయిట్ చేస్తూ వుండగా , అప్పుడే దగ్గరలో ఉన్న ఇద్దరు జపనీస్‌ రిపోర్టర్లు ఆమె స్టైలిష్‌ డ్రెస్‌ని చూసి.. ఫ్యాషన్‌ రంగానికి చెందిన ప్రముఖురాలిగా పొరబడ్డరట. ఇంకేముంది ఆమె దగ్గరికి వచ్చి ఫోటోలు తీయడం మొదలు పెట్టారు. అటు తరువాత ఇంకొంత మంది మాకు మాకు అంటూ తెగ ఫోటోలు దింపారు. అంతటితో ఆగలేదు ఏవేవో ప్రశ్నలు వేయడం చేయడం మొదలుపెట్టారు. ఇదంతా గమనించిన తన స్నేహితురాలు ఇలా కాదు ఇక నువ్వు ఫ్యాషన్‌ రంగం వైపు ప్రయత్నించు అని సలహా ఇచ్చింది.

ఇంకేముంది ఆరు పదుల వయసులో ‘యాక్సిడెంటల్‌ ఐకాన్‌’ పేరుతో ఓ బ్లాగ్‌ని తెరిచింది. తనకు నచ్చిన దుస్తులతో ఫొటోలు దిగుతూ వాటిని ఆ బ్లాగ్‌లో పెట్టేస్తుంది. ఫ్యాషన్‌గా ఉండటానికి వయసుతో సంబంధం లేదని చాటిచెబుతూ లిన్‌ పెట్టే ఫొటోలకు మంచి స్పందన కూడా వస్తుంది. చాలా తక్కువ సమయంలోనే వేలాదిమంది ఆమె బ్లాగ్‌ కి ఫాలోవర్స్ అయ్యారు. అంతేకాకుండా ఆమెను పొగిడేస్తూ చాలామంది యువత ఈమెయిల్స్‌ కూడా పంపేవారంట.

మొత్తానికి ఈ భామ్మ స్టైల్ ని ప్రముఖ ఫ్యాషన్‌ సంస్థ ఎలైట్‌ లండన్‌ గుర్తించింది, తమ ఉత్పత్తుల ప్రచారం కోసం లిన్‌తో ఈ జనవరిలో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సూపర్ కదా.. అనుకోకుండా మోడలింగ్ లోకి అడుగు పెట్టినా ఫ్యాషన్‌ కే ఐకాన్ అయ్యి, వారెవా భామ్మ..అనిపించుకుంటుంది.