నిన్న తెలంగాణ అసెంబ్లీ లో జరిగిన ఘటనలో మండలి చైర్మైన్ స్వామి గౌడ్ కంటికి గాయమైన విషయం అందరికి తెలిసిందే. ఈ వ్యవహారం లో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ నేతల ఫై తీవ్రమైన విమర్శలు చేసింది.
అసెంబ్లీ వాయిదా తరువాత అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీష్ రావు సమక్షం లో వీడియోలను పరిశీలించి, వాటిని మీడియాకు అందజేశారు. స్వామిగౌడ్ గారిని చికిత్స నిమిత్తం సరోజినిదేవి కంటి ఆసుపత్రికి తరలించారు. అయన కుడి కన్ను కు గాయం అయినట్టు తెలిపారు.
ఆశలు వ్యవహారం ఇక్కడే మొదలయింది. స్వామిగౌడ్ కి చికిత్స చేసిన తరువాత ఏబీఎన్ ఛానల్ లో అయన ఎడమ కన్నుకి ప్లాస్టర్ ఉన్నట్టు చూపించారు. తరువాత ఏబీఎన్ వారు దీనిపై వివరణ ఇచ్చారు.ఆశలు స్వామిగౌడ్ గారికి కుడి కన్ను కి గాయమైంది. వీడియో ఎడిటింగ్ లో మిర్రర్ ఎఫెక్ట్ కారణం గా ఎడమ కన్నుకు ప్లాస్టర్ ఉన్నట్టు కనిపించింది అని చెప్పారు.
దీనిపై నెటిజన్లు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఒక మండలి చైర్మైన్ ను చూపించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదా అని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్స్ కుడి ఎడమైతే పొరపాటులేదోయ్ అని ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఏబీఎన్ పొరపాటు లేకుండా నిజాలను మాత్రమే చూపించాలని నెటిజన్స్ ఆశాభావం వ్యాక్యహం చేస్తున్నారు.