ముంబై ఆటగాడు అభిషేక్ నాయర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. టీం ఇండియా ఆటగాడు దినేష్ కార్తిక్ తన రెండో భార్య అంటూ సరదా వ్యాఖ్యలు చేసాడు. వివరాల్లోకి వెళితే ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన ముక్కోణపు సీరీస్ ఫైనల్ మ్యాచ్ లో దినేష్ కార్తిక్ సంచలన ఆట తీరుతో టీం కి విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
12 బంతుల్లో 34 పరుగులు చెయ్యాల్సిన తరుణంలో బ్యాటింగ్ కి వచ్చిన కార్తిక్ అద్భుతమైన ఆట తీరుతో టీంకి విజయాన్ని అందించాడు. అయితే మ్యాచ్ అనంతరం దినేష్ కార్తిక్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసాడు. తాను ఈ రోజు ఇలా ఆడటానికి ముంబై ఆటగాడు అభిషేక్ నాయర్ కారణమని.. ఫాం కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు తనకు అండగా నిలిచి మద్దతు ఇచ్చాడని వ్యాఖ్యానించాడు.
ఇద్దరు ముంబైలో చిన్న గదిలో ఉన్నామని చెప్పుకొచ్చాడు. ఈ నేపధ్యంలో నాయర్ స్పందించాడు. దినేశ్ కార్తీక్ తన రెండో భార్య అని చెప్పిన నాయర్ తామెక్కడున్నా రోజుకు రెండుసార్లు మాట్లాడుకుంటామని అది తమకు ఓ వ్యసనంగా మారిపోయిందన్నాడు. తామిద్దరం మాట్లాడుకోలేకుండా ఉండలేమని అన్నాడు.