//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Category : world

భారత్,పాకిస్థాన్ మధ్య ఎప్పుడు కాల్పులుజరుగుతాయి అన్న సంగతి మనకి తెలిసిందే.భారత్ శాంతి కోరుకుంటుంటే,పాక్ మాత్రం కాల్పులు జరుపుతుంది.జమ్మూ కాశ్మీర్ మాజీ మంత్రి ఒక సందేశాన్ని అందించారు.వివరాలలోకి వెళ్తే,

సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల ఎగుమతిని పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడం మినహా ఇండియాకు మరో మార్గం ఉండదని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా హెచ్చరించారు. భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలని పాక్ కోరుకుంటే ఉగ్రవాదానికి ముగింపు పలకాలని సూచించారు.

శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇండియాపై ఉగ్రవాదులు దాడి జరపని రోజంటూ లేదని అన్నారు. 'ఉగ్రవాదులంతా పాకిస్థాన్ నుంచే వస్తున్నారు. ఇండియాతో శాంతిని పాక్ కోరుకుంటే ఉగ్రవాద పంథాను వీడాల్సి ఉంటుంది. లేని పక్షంలో పాక్‌పై యుద్ధం ప్రకటించడం మినహా మనకు మరో మార్గం ఉండదు. యుద్ధం వల్ల రెండు దేశాలూ వినాశాన్ని చవిచూడాల్సి వస్తుంది.

ఇప్పటికైనా పాక్ ఉగ్రవాద పంథాన్ని వీడి చర్చలకు చొరవ చూపించాలని చెప్పదలచుకున్నాను' అని ఫరూక్ అన్నారు. ఇరుదేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలంటే చర్చలు ఒక్కటే పరిష్కార మార్గమని ఆయన సూచించారు. సుంజ్వాన్ ఆర్మీ శిబిరంపై శనివారం తెల్లవారుజామున జైషే ఉగ్రవాదుల దాడి జరిపిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జైషే దాడిలో ఇద్దరు జూనియర్ కమిషన్డ్ అధికారులు మృతిచెందగా, ఒక పౌరుడితో సహా నలుగురు గాయపడ్డారు.

Related News