//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆగస్టులో డీవిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటన !

Category : sports

వన్డే, టెస్ట్, T20 లు ఫార్మాట్ ఏదైనా సరే తన విధ్వంసక బ్యాటింగ్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేయగలడు ఏబి డివిలియర్స్. కానీ కొంతకాలంగా వేధిస్తున్న గాయాలు... మరోవైపు జట్టు ఓటముల భారం....అన్ని ఫార్మాట్లలో కీలక బ్యాట్స్‌మన్‌గా ఎదురవుతున్న ఒత్తిడిని ఎదురుకుంటున్న డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికేందుకు సిద్దమవుతున్నట్లు సంకేతాలిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులోగా రిటైర్మెంట్ పై తుది నిర్ణయం తీసుకుంటానని ఏబీ సంచలన ప్రకటన చేశాడు.

డీవిలియర్స్ నాయకత్వంలో నిన్నటిదాకా ఘన విజయాలు నమోదు చేసిన సౌతాఫ్రికా.... ఇటీవల జరిగిన ఇంగ్లండ్ పర్యటనలో ఆ జట్టు పరాభవాలను మ్ముటగట్టుకుంది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో 1-2తో ఓటమి.. అనంతరం చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత అవమానకరంగా తొలిరౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టడంతో డీవిలియర్స్ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్‌తోనే ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లోనూ సఫారీ జట్టు ఓడిపోవడంతో కెప్టెన్ డీవిలియర్స్ పూర్తిగా డీలాపడ్డాడు. మూడో మ్యాచ్‌లో ఓటమి తర్వాత పూర్తి నిర్వేదంతో మాట్లాడిన డీవిలియర్స్ తన భవితవ్యంపై ఆగస్టులోగా నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పాడు. మూడు ఫార్మాట్లలో ఆడుతూ ఉండడంతో పాటు ఐపీఎల్, మిగతా టీ20 సిరీస్‌లలో ఆడుతూ కీలక బ్యాట్స్‌మన్‌గా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పాడు.

Related News