//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇవియంలపై ఇసి సవాళ్లకు వెనుదిరిగిన ఆప్, బీఎస్పీ

Category : national politics

ఈ మధ్య జరిగిన యుపి, పంజాబ్, ఢిల్లీ ఎన్నికలలో తమ పార్టీల పరాజయానికి ఇవియం లే కారణం అని, ఏ బటన్ నొక్కినా బిజెపి గుర్తు కమలంకే వోట్ పడే విధంగా వాటిని రిమోట్ లో ఆపరేట్ చేస్తున్నారని అంటూ గొంతెత్తి అరచిన ఆప్, బీఎస్పీ అధినేతలు ఈ విషయమై  ఎన్నికల కమీషన్ విసిరిన సవాళ్లకు తోకముడుస్తున్నారు. 

ఇవియం లను ఆ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదని వాదిస్తూ వచ్చిన ఎన్నికల కమీషన్ జూన్ 3 న వచ్చి ఇవియం లను దిద్దుబాటు చేసి చూపమని అంటూ సవాల్ విసిరింది. అందుకు సిద్ధంగా ఉన్న పార్టీలు మే 26 సాయంత్రం లోగా తమకు తెలుపాలని అడిగింది. ఆ విధంగా ఏడు జాతీయ పార్టీలు, 49 ప్రాంతీయ పార్టీలకు అవకాశం కలిపించింది. 

అయితే ఈ సవాళ్లకు కేవలం ఎన్సీపీ, సిపియం మాత్రమే సానుకూలంగా స్పందించాయి. బీఎస్పీ నుండి అసలు స్పందన లేదు. ఆప్ మాత్రం కీ బోర్డు మార్పుకు అవకాశం లేకుండా చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఎన్నికల కమీషన్ సవాల్ పారదర్శకతగా లేదని విమర్శించింది. 

కాంగ్రెస్ పార్టీ సహితం ఇవియం లో పలు భాగాలు మార్చడానికి అవకాశం ఉండగా కేవలం ఒకటి, రెండు భాగాలకు ఇసి పరిమితం చేయడం భావ్యం కాదని స్పష్టం చేసింది. ఈ సవాల్ కు ఇసి పేర్కొన్న నిబంధనలు, షరతులను మార్చాలని ఆప్, కాంగ్రెస్ కూడా కోరాయి. అయితే అందుకు ఇసి నిరాకరించింది. 


Related News