మొన్నటివరకు ఆధార్ కి మొబైల్ నెంబర్ అనుసంధానం అన్నారు. ఆ తరువాత బ్యాంకులకు కూడా ఆధార్ అనుసంధానం అన్నారు. ఇప్పుడు ఆవులకు కూడా ఆధార్ అనుసంధానం అనుటున్నారు.
ఈ సంఘటన అహ్మదాబాద్ లో చోటు చేసుకుంది. ఇక్కడ ఆవులన్ని రోడ్లమీదకు వస్తుండటంతో, ఆ బెడదని తొలగించడానికి సూరత్ నగర పాలక సంస్థ అధికారులు ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు.
అయితే ఓ గుర్తింపు బిళ్ళని ఆవుల చెవులకు తగిలించి, వాటికి సంబంధిత యజమాని ఆధార్ కార్డు ను అనుసంధానం చేయనున్నారు. వీటికి "క్యాటిల్ రిజిస్ట్రేషన్ నెంబరు" ను నమోదు చేసి, ఆ వివరాలను కంప్యూటర్ లో భద్రపరుస్తారు.
ఆ నెంబర్ ను పశువు చెవికి కుట్టే ప్లాస్టిక్ బిళ్లపై ముద్రిస్తున్నారు. ఆవులు రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అక్కడి అధికారులు. ఇప్పటివరకు 15 మంది యజమానుల 25 వేళా ఆవులకు ఆధార్ ను అనుసంధానం చేసారు. ఏదైనా ఆవు రోడ్లమీదఁదకి వచ్చి సమస్య క్రియేట్ చేస్తే వాటి సంబంధిత యజమానికి రూ.1,800 వంతున జరిమానా విధిస్తున్నారు.