జింబాబ్వే అధ్యక్షుడి మీద నోరుపారేసుకున్నందుకు గాను ఒక యువతి అరెస్ట్ అయ్యి జైలు పాలు అయ్యింది. వివరాలలోకి వెళ్తే 25 సంవత్సరాల మార్త దోనోవా అనే యువతి వ్యంగాస్త్రాలు ప్రచురించే వెబ్ సైట్ సంస్థ లో పని చేస్తుంది. అయితే తన ట్విట్టర్ ఖాతాలో ఆ దేశ అధ్యక్షుడు అయిన రాబర్ట్ ముగాబే ని స్వార్ధపరుడు అయిన ఒక పనికి రాని వాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు అని ట్వీట్ చేసింది. దీనితో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఒక వేళ ఆమె నేరం రుజువు అయితే 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది.అయితే ఆ ట్వీట్లు తను చేసినవి కావని మార్త వాదిస్తుంది. 93 సంవత్సరాల వయసున్న రాబర్ట్ ముగాబే జింబాబ్వే దేశాన్ని 1980 నుండి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నారు.