Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దెయ్యాన్ని పెళ్లి చేసుకున్న యువతి..!

Category : world

కొన్ని స్టోరీలు అంతే.. చదవడానికి వింతగా ఉంటాయి. అసలు నమ్మశక్యంగా కనిపినిజంగా ఇలాంటివి జరుగుతాయా అనిపిస్తుంది. అలాంటిదే ఈ స్టోరీ. ఐర్లాండ్‌లో అమందా అనే ఓ యువతి 300 ఏళ్ల కిందట చనిపోయిన ఓ హైతీ పైరేట్ ఆత్మను పెళ్లి చేసుకుంది.

2016 జులైలో చట్టబద్ధంగా జాక్ టీగ్ అనే ఆ పైరేట్ ఆత్మను పెళ్లి చేసుకున్నట్లు అమందా చెప్పుకుంటున్నది. అతను 1700 కాలంలోనే చనిపోయాడు. మరీ విస్తుగొలిపే విషయం ఏమిటంటే తన జీవితంలో అతనితో ఎంజాయ్ చేసినట్లుగా సెక్స్‌ను ఇంకా ఎవరితోనూ చేయలేదని అమందా చెప్పడం. నిజానికి యూకే లేదా ఐర్లాండ్‌లో ఇలా ఆత్మలను పెళ్లికోవడాన్ని ప్రభుత్వం గుర్తించదు.

దీంతో గతేడాది అక్టోబర్‌లో అట్లాంటిక్ మహా సముద్రం మధ్య తన స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మరోసారి జాక్ ఆత్మను పెళ్లి చేసుకుంది అమందా. ఐర్లాండ్‌లోని డ్రోగెడాలో తన ఇంట్లో ఉండగా ఈ ఆత్మతో పరిచయం ఏర్పడినట్లు అమందా చెబుతున్నది. ఆరు నెలల తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నామని అనుకున్నాక పెళ్లి చేసుకుందామని డిసైడయ్యారు. మిగతా సాధారణ సంబంధాల్లోలాగే వీళ్లు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు.. వీకెండ్స్‌లో కలిసి సినిమాలకు, షికార్లకు తిరుగుతారట.

అసలు మా మధ్య కెమెస్ట్రీ అదుర్స్ అంటున్నది అమందా. యూకే లేదా ఐర్లాండ్‌లో ఇలా ఆత్మలను పెళ్లి చేసుకోవడాన్ని గుర్తించకపోయినా కొన్ని దేశాలు, సామాజిక వర్గాల్లో ఇది చట్టబద్ధం. ఫ్రాన్స్‌లోనూ దీనికి చట్టబద్ధత ఉంది. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో వందల మంది మహిళలకు యుద్ధంలో చనిపోయిన తమ భాగస్వాముల ఆత్మలను పెళ్లి చేసుకునే అవకాశం అక్కడి ప్రభుత్వం కల్పించింది.

Related News