//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

Category : world

ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే ఒక బేబీ చుట్టూ హార్ట్ సింబల్ ఆకారంలో సిరంజీలను అమర్చి తీసిన ఫొటో. దీనిని చూసిన జనం ఆ బేబీకి, హార్ట్ సింబల్ కు, సిరంజీలకు ఉన్న సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారు. తరువాత అసలు విషయం తెలుసుకున్న జనం ఆర్చర్యానికి గురైయ్యారు.

పాట్రీసియా నీల్, కింబెర్లీ అనే ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. తమకు ఓ బిడ్డ కావాలని అనుకున్నారు. దీనికి వారు ఐయూఐ (ఇంట్రా యూటిరైన్ ఇన్‌సెమినేషన్) పద్ధతిని ఎంచుకున్నారు. ఇది కూడా సరోగసీ వంటి ఓ పద్ధతే. అది ఫెయిల్ కావడంతో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిని ఎంచుకుని నాలుగేళ్ల పాటు ప్రయత్నించారు. ఎన్నోమార్లు ఐవీఎఫ్ కూడా విఫలమైంది.

వారి ప్రయత్నం నాలుగేళ్ల తరువాత ఫలించి పాట్రీసియా నెల తప్పింది. అయితే కడుపులోని పిండం పరిస్థితి బాగాలేదని వైద్యులు చెప్పగా, దినదిన గండంగా గడుపుతూ, 9 నెలల పాటు గర్భాన్ని మోసి, ఈ బిడ్డను కంది. ఆపై ఐయూఐ, ఐవీఎఫ్ విధానాల్లో తాము వాడిన సిరంజీలను ఇలా పేర్చి, మధ్యలో తమ బిడ్డను ఉంచి ఈ ఫొటో తీసి సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంది ఈ జంట. 1,616 సిరంజీలను వాడి వీర్య కణాలను గర్భంలోకి ప్రవేశపెట్టారని, తాను తల్లి కావాలన్న కోరిక తీరిందని ఆనందంగా చెప్పింది పాట్రీసియా.

Related News