//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పుచ్చకాయతో పట్టులాంటి మృదువైన చర్మం

Category : health

పుచ్చ్చకాయ అంటే వేసవిలో దాహార్తిని తీర్చే పండుగానే పుచ్చకాయ గురించి ఎక్కువగా తెలుసు. అయితే అందానికి కూడా పుచ్చకాయ బాగా పనికొస్తుంది. పుచ్చలో చక్కెర పదార్థం కేవలం ఆరుశాతం ఉంటే , 93 శాతం నీరు ఉంటుంది. అందుకే దీన్ని ‘నేచురల్‌ టోనర్‌’ అంటారు. దీన్ని షవర్‌ జెల్‌లు, లిప్‌స్టిక్‌లు, లిప్‌ గ్లాసెస్‌ తయారీలో వాడతారు.

విటమిన్‌ఎ, బి6, విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉండటం వల్ల పుచ్చరసం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. చర్మం ముడతలు పడటాన్ని నివారిస్తుంది.

పుచ్చగుజ్జును టోనర్‌గానూ వాడొచ్చు. గుజ్జును చర్మంపైన రాసి దానిపై ఫ్రూట్‌ప్యాక్‌ వేసుకుని 30 నిమిషాలుంచి కడిగేయాలి. అన్ని రకాల చర్మాలకు ఇలా చేయవచ్చు. చర్మాన్ని చల్లబరచటమే కాదు యవ్వనంగా ఉంచుతుంది. చర్మం చుట్టూ పొరలా ఏర్పడి తేమ బయటకు వెళ్లకుండా చేస్తుంది. దీనివల్ల పొడి చర్మం కూడా మృదువుగా మారుతుంది.

వయసు పెరిగే ప్రక్రియను నిరోధించే గుణాలు పుచ్చలో ఉన్నాయి. అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండెపోటు, రక్తపోటు ముప్పును తగ్గిస్తుంది.

బరువు తగ్గటానికి కూడా ఈ వాటర్‌మెలన్‌ అద్భుతంగా పనిచేస్తుంది. అమైనోయాసిడ్‌లు పుచ్చలో పుష్కలం. ఇవి కేశనాళికలకు రక్తప్రవాహాన్ని పెంచుతాయి. వెంట్రుకలకు పుచ్చగుజ్జును రాసి 30 నిమిషాల పాటు ఉంచితే కేశాలు బాగా ఎదుగుతాయి.

ఈ జ్యూస్‌ను దూదితో ముఖంపైన రాస్తే చర్మం బిగుతుగా, కాంతివంతం అవుతుంది