ఆటలు పాటలు విందు వినోదాలు అంగరంగ వైభవంగా 9 ఐ పీ ఎల్ ల ఆరంభోత్సవాలు ఇంతవరకు ఒకే వేదిక మీద జరుగుతూ వచ్చాయి .అయితే ఈ సారి అందుకు బిన్నంగా 8 జట్లు వారు వారి వారి సొంత గడ్డ ల పైనే ప్రారంభోత్సవాల్ని నిర్వహిస్తున్నారు.ఇందులో మొదటిదిగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. ఐపీఎల్లో ఇది పదో సీజన్ కావడంతో దీన్ని ప్రత్యేకంగా భావించి స్థానిక ప్రేక్షకులకు వినోదం పంచాలన్న ఫ్రాంచైజీల కోరిక మేరకు 8 వేదికల్లో ఆరంభ వేడుకల్ని నిర్వహించాలని ఐపీఎల్ పాలక మండలి నిర్ణయించింది.
బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్కు రంగం సిద్ధం అయింది.సాయంత్రం 6:20 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఇందుకు క్రికెట్ దిగ్గజాలు అయినా సచిన్ తెందుల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ లు మైదానం లో కనిపించనున్నారు. రవిశాస్త్రి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.ఈ ఐ పీ ఎల్ పదో సీజన్ లో బాలీవుడ్ నటి అమీ జాక్సన్ 300 మంది బృందం గా ఏర్పడి కన్నుల విందు చేయనుంది.ఇక రెహ్మన్ బృందం పాటల తో వీనుల విందు చెయ్యబోతున్నారు. ఆ తరువాత 7 గంటలకి ఇరు జట్లు మైదానంలోకి ఎంట్రీ ఉంటుంది .8 గంటలకి సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోటీ మొదలుతుంది