//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

A. R రెహ్మాన్ నాకు ఆత్మహత్య చేసుకోవాలి అనిపించింది

Category : movies

A.R రెహ్మాన్ ది మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఇండియా. అయన తో పని చేయాలని ప్రతి హీరో ఆశపడతారు, ప్రతి డైరెక్టర్ పని చేయాలని కోరుకుంటాడు.ప్రస్తుతం ఈయన చేసిన రోబో 2.o రిలీజ్ కి సిద్హంగా వుంది.ఆయన జీవితం ఆధారం గా ‘నోట్స్‌ ఆఫ్‌ ఎ డ్రీమ్‌: ది ఆథరైజ్డ్‌ బయోగ్రఫీ ఆఫ్‌ ఏఆర్‌ రెహ్మాన్‌’ అనే బయోగ్రఫీని కృష్ణ తోలిక్ రాసాడు. ఈ పుస్తకాన్ని ఏఆర్ రెహ్మాన్ ఆధ్వర్యం లోనే శనివారం విడుదల చేసారు. ఈ ప్రసంగంలో మాట్లాడుతూ ఏఆర్ రెహ్మాన్ పలు ఆశక్తికర అంశాలు పంచుకున్నారు.A.R Rahman reveals about his bad experiences

ఏఆర్ రెహ్మాన్ అసలు పేరు దిలీప్ అని , ఆయనకు ఆ పేరు అస్సలు ఇష్టం ఉండేది కాదని ఆయన చెప్పారు. రోజా సినిమా కి సంగీతం అందిస్తున్న సమయం లో తన కుటుంబ సభ్యులు ఇస్లాం మతంలోకి మారడం తో తన పేరు రెహ్మాన్ గా మారిందని చెప్పారు. ఆలాగే అతనికి 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆత్మహత్యా చేసుకోవాలి అనిపించేదట.ఆయన తండ్రి మరణంతో దృఢపడ్డానని, ఆ తరువాత ఒకే సారి 35 మూవీలు వస్తే 3 సినిమాలు మాత్రమే ఒప్పుకున్నని చెప్పుకొచ్చాడు.A.R Rahman reveals about his bad experiences