//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రాణం తీసిన తియ్యని లడ్డు...

Category : state

ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే బంధువులు, మిత్రులందరూ కలిసి చాల ఆనందం గా ఉంటారు. కానీ అదే పెళ్ళిలోనో, నిశ్చితార్థంలో గొడవ జరిగితే చినికి చినికి గాలివానై ప్రాణాలు మీదకు తెస్తున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి కర్నూలు జిల్లాలో జరిగింది. భోజనాల్లో వడించే లడ్డూ గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అప్పటి వరకు ఎంతో కళకళలాడుతూ సంతోషంగా ఉన్న పెళ్లి వారింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కర్నూల్ జిల్లా కొత్తపల్లి మండలంకు చెందిన మరియమ్మ, ఏసన్న దంపతుల కుమార్తెకు పాములపాడు మండలంకు చెందిన ప్రశాంత్‌తో సోమవారం నిశ్చితార్థం జరిగింది. అనంతరం భోజనాలు వడ్డిస్తున్న జంబులయ్యతో అదనంగా ఇంకో లడ్డూ ఇవ్వాలని తప్ప తాగిన మైకంలో ఉన్న చెన్నయ్య, ఆంజనేయులు గొడవ పడ్డారు.

లడ్డూ కోసం మొదలైన చిన్న గొడవ భీకర పోరుకు దారి తీసింది. ఈ గొడవని అడ్డుకునేందుకు పెళ్లి కుమార్తె సొంత అన్నయ్య కుమార్‌ ప్రయత్నించాడు. ఈ సమయంలో అతనిపై చెన్నయ్య, ఆంజనేయులుతో పాటు సుజాత, మరికొందరు కలిసి దాడి చేశారు. దీంతో పెళ్లి కూతురు అన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.