//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

nara lokesh : నారా లోకేష్ : A P IT minister nara lokesh education family biography pictures and news

Category : editorial

నారా లోకేశ్ జనవరి 23, 1983 న జన్మించాడు. ఆయన నారా చంద్రబాబునాయుడు మరియు భువనేశ్వరిల యొక్క ఏకైక కుమారుడు. ప్రముఖ తెలుగు సినిమా నటుడు ఎన్.టి.రామారావు యొక్క మనుమడు. 2007 లో లోకేష్ తన మామ అయిన హీరో నందమూరి బాలకృష్ణ ప్రథమ పుత్రిక అయిన నందమూరి బ్రహ్మణిని పెళ్లి చేసుకున్నాడు.ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు.లోకేష్ కొడుకు పేరు దేవాన్ష్.

ఆయన స్టాన్‌ఫర్డు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.ఎ చేసడు. కెర్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజిమెంటు ఇన్ఫర్‌మేషన్ సిస్టమ్స్ విభాగంలో బి.ఎస్సీ చేసాడు.ఆయన తెలుగుదేశం పార్టీ 2009 మానిఫాస్టోలో తెలియజేసిన కాష్ ట్రాన్స్‌ఫర్ స్కీమును అభివృద్ధి చేసాడు. నారా లోకేశ్ మొట్టమొదట పార్టీలోనికి మే 2013లో చేరాడు. అతడు తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించాడు. లోకేష్ హెరిటేజ్ ఫుడ్స్ కు మేనేజింగ్ డైరెక్టెర్ గా పనిచేసాడు.

ఆయన మార్చి 30, 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికైనాడు.అయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పంచయత్ రాజ్ మరియు రూరల్ డెవలప్‌మెంటు" శాఖను విర్వర్తిసున్నారు. ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఎనిమిది ఐ.టి కంపెనీలను ప్రారంభించాడు.

లోకేష్ ట్రస్టులో ఆరోగ్యసంరక్షణ కార్యక్రమాన్ని రూపకల్పన చేసాడు. దీనిని పేద ప్రజలు వారి ఆరోగ్యంపై శ్రద్ద తీసుకొనుటకు, వారి అవసరాలకు అనుగుణంగా మంచి ఆరోగ్య సేవలకు అందుచుటకు ఉపయొగపడే కార్యక్రమం ఇది. ఇది గ్రామీణ మరియు పట్టణ ప్రకజలు చేరవేయబడే కార్యక్రమం. ఆయన రక్త బ్యాకులు, హెల్త్ క్యాంపులు,మొబైల్ క్లినిక్స్ మరియు నేత్ర శిబిరాలు నిర్వహిస్తున్నాడు.

2018 లో ఈయనకు పరిపాలనలో సృజనాత్మక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేవారికి అందించే అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారం లభించింది.