//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రెండు లక్షల దొంగతనం చేసిన కోతి

Category : national

బ్యాంకులో డబ్బులు కట్టేందుకు తన కూతురితో కలిసి వెళ్లిన ఓ కస్టమర్‌కు వింత అనుభవం ఎదురైంది. అతని చేతిలోని డబ్బుల బ్యాగ్‌ కన్నుతెరిచి కన్నుమూసే లోపు మాయమైంది. ఏంటి నమ్మరా..? నిజమే..ఈ ఘటనకు పోలీసులు ఏ సెక్షన్ కింద కేసులో పెట్టాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. రెండ్రోజుల క్రితం ఈ సంఘటన ఆగ్రాలో జరిగింది.బాధితుడు విజయ్ బన్సాల్ చెప్పిన వివరాల ప్రకారం... నయి మండి ఏరియాలోని మొదటి అంతస్తులో ఉన్నఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకుకు బన్సాల్ తన కుమార్తెతో కలిసి వెళ్లాడు. రూ.2 లక్షలున్న క్యాష్ బ్యాగ్ ఆమె చేతులో ఉంది. 'ఈ ఏరియాలో చాలా కొతులున్నాయి.

వాటిలో ఓ కోతి మేము మెట్లు ఎక్కుతుండగా అకస్మాత్తుగా క్యాష్ బ్యాక్ లాక్కుని పై అంతస్తులోకి ఎగురుతూ వెళ్లింది. ఎలాగో రూ.60,000 దక్కించుకున్నా కష్టపడి సంపాదించిన సొమ్మంతా కోతులపాలైంది' అంటూ బన్సాలీ కన్నీటి పర్యంతమయ్యాడు. సంఘటన తెలిసిన వెంటనే బ్యాంకు సిబ్బంది, గార్డు సాయానికి వచ్చారని, బ్యాగ్‌ను చించేసిన కోతి రూ.60,000 తమవైపుకు విసిరేయడంతో ఆ సొమ్ము మాత్రమే తమకు దగ్గందని అతను చెప్పాడు. ఆహారం చూపిస్తే బ్యాగ్ ఇస్తుందనే ఆశతో ఆ ప్రయత్నం కూడా చేశామని, అయినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని డబ్బుల బ్యాగ్ కోసం కోతుల వెంటపడ్డారు.