//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దారి దోపిడీ..!

Category : state

ఈ మధ్య ఎక్కడ చుసిన దొంగతనాలు,దోపిడీలు ఎక్కువగ అవుతున్నాయి.అలంటి ఒక సంఘటన కొత్తూరు మండలం గూడూరు సమీపంలో శనివారం అర్ధరాత్రి నాటు తుపాకీతో బెదిరించి దారిదోపిడీకి పాల్పడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. దశరథ్ అనే వ్యక్తి మండల కేంద్రంలో ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు.

అయితే శనివారం రాత్రి ఇంటికి వెళుతుండగా రోడ్డుపై రాళ్లు అడ్డంగా పెట్టి ఉండడంతో అతను తన వాహనాన్ని ఆపాడు. ఈలోగా రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు దశరథ్ కళ్లల్లో కారం చల్లి అతని దగ్గరున్న రూ. 2లక్షల నగదును లాక్కెళ్ళారు. కాగాజరిగిన సంఘటన నుంచి తేరుకున్న దశరథ్ అరుచుకుంటూ పక్కనే ఉన్న తండాకు చేరుకుని అక్కడి ప్రజలకు జరిగిన విషయం తెలిపాడు.

అనంతరం గ్రామస్తులతో కలిసి దోపిడీకి పాల్పడ్డ వ్యక్తుల కోసం వెతకగా ఓ వ్యక్తి దొరికాడు. అతన్ని పట్టుకునే క్రమంలో అతని వద్ద నాటు తుపాకీ ఉన్నట్లు గుర్తించారు. అతన్ని పట్టుకునే సమయంలో జరిగిన పెనుగులాటలో నాటు తుపాకీ పేలినట్లు తెలిసింది. కాగా సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే దోపిడీకి పాల్పడ్డ వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.