//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆధార్ లేదని అనుమతించలా......వార్డ్ బయటే బిడ్డ కు జన్మనిచ్చింది......!

Category : national

ఆధార్ నెంబర్ ఇచ్చినా ఆధార్ కార్డు చూపించాల్సిందేనంటూ వైద్య సహాయానికి నిరాకరించడంతో ఓ నిండు గర్భిణి ఎమర్జెన్సీ వార్డు వెలుపలే ప్రసవించింది. ఈ సంఘటన గురుగావ్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. విషయం బయటకు పొక్కడంతో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్, స్టాఫ్ నర్సును గుర్‌గావ్ చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ బీకే రజోరా విధుల నుంచి సస్పెండ్ చేశారు.

మున్ని కేవత్ అనే గర్భిణిని ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆమె భర్త ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. నొప్పులు ఎక్కువ కావడంతో లేబర్ వార్డుకు ఆమెను తీసుకువెళ్లాడు. అయితే అక్కడి సిబ్బంది అడ్మిషన్ కావాలంటే ఆధార్ కార్డు కావాలని పట్టుబట్టారు. ఆధార్ కార్డు తీసుకురాలేదని, నెంబర్ ఇవ్వగలనని తాను చెప్పినప్పటికీ లేడీ డాక్టర్, నర్సులు వినిపించుకోలేదనీ, దీంతో తన భార్యను బంధువులకు అప్పగించి కార్డు తెచ్చేందుకు ఇంటికి వెళ్లాలని మున్ని కేవత్ భర్త రామ్‌సింగ్ తెలిపాడు.

నొప్పులు ఎక్కువ కావడంతో మున్ని కేవత్‌ను కాజల్టీ వార్డుకు తీసుకు వెళ్లామని, అక్కడ కూర్చోడానికి కూడా బాధితురాలిని అనుమతించలేదని ఆమె బంధువు ఒకరు తెలిపారు. దీంతో ఎమర్జెన్సీ వార్డు గేటు బయటే ఆమె ఆడబిడ్డను ప్రసవించినట్టు చెప్పారు. నేలపైనే ప్రసవం జరిగి ఆ ప్రాంతమంతా రక్తంతో నిండిపోయినా ఆసుపత్రి సిబ్బంది తన భార్యను పట్టించుకున్న పాపాన పోలేదని సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు.

మానవత్వం లేని ఆసుపత్రి సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. విషయం తెలిసిన వైద్య అధికారులు ఒక డాక్టర్‌ను, నర్స్‌ను సస్పెండ్ చేసారు. ఇతర సిబ్బంది ప్రమేయంపై కూడా విచారణ జరుపుతున్నట్టు చీఫ్ మెడికల్ అధికారి రజోరా తెలిపారు.ఢిల్లీ లో జరిగిన ఈ ఘటన అందరిని ఆశ్చర్యపరిచింది.