//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సోషల్ మీడియాకి గులాం అయినా భార్యను ,భర్త ఏంచేసాడో తెలుసా?

Category : national

భార్యతో కలిసి జీవితం పంచుకోలేనని, ఆమె నుంచి తనకు విడాకులు ఇప్పించాలని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కోర్టు మెట్టెక్కారు. ఆ టెకీ పిటిషన్‌లో పేర్కొన్న విషయాలు చూసి లాయర్లు షాక్‌ అయ్యారు. భార్య ఇంటర్‌నెట్‌ ఎక్కువగా వాడుతోందని తనను ఏమాత్రం పట్టించుకోక పోవడమే విడాకుల దరఖాస్తుకు కారణమని టెకీ పేర్కొన్నాడు. గతంలో గృహహింస, అదనపు కట్నం వేధింపులు లాంటి కారణాలతో విడాకులకు వచ్చేవారని, ప్రస్తుతం సోషల్‌ మీడియా లాంటి వాటి వల్ల దంపతులు విడాకులు కోరడం ఆందోళన కలిగించే విషయమని ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ హిమా కోహ్లీ వ్యాఖ్యానించారు.ఢిల్లీలో నరేంద్ర సింగ్ అనే ఓ సాఫ్ట్ వెరే ఉద్యోగి అయితే పెళ్లైన రోజునుంచీ భార్య ఇంటర్నెట్‌ ఎక్కువగా వాడుతూ సోషల్‌ మీడియాలో బిజీగా ఉంటుందని ఈ టెకీ గ్రహంచాడు.

కొన్ని రోజులకు మార్పు వస్తుందని భావించగా.. అతడి భార్య సోషల్‌ మీడియాలో మేల్‌ ఫ్రెండ్స్‌తో అర్ధరాత్రిళ్లు చాటింగ్‌ చేయడం నరేంద్ర చూశాడు. ఇలాంటి పనులు మానుకోవాలని తనను, తన కుటుంబ బాధ్యతలు షేర్‌ చేసుకోవాలని కోరగా, టెకీపై భార్య పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగింది. చేసేదేంలేక టెకీ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కాడు.ఆ కోర్టు కూడా ఆయనకు మద్దతు ఇచ్చింది ఈ విషయంపై నిజాలు ఏంటో తేలాల్సివుంది...