//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రేమించమని బెదిరింపు.....!

Category : national

ఎక్కడ చుసిన ఆడవారి పై హత్యాచారాలే.ప్రేమ పేరుతో ఎంతో మంది మోసపోతున్నారు.అలంటి ఒక సంఘటన కరప లో జరిగింది.వివరాలలోకి వెళ్తే,

ఇంట్లో ఉన్న ఒక యువతిని చంపుతామని బెదిరించిన ముగ్గురు యువకులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు కరప ఏఎస్‌ఐ అడ బాల గంగరాజు తెలిపారు. కరప మండలం పెనుగుదురు గ్రామానికి చెందిన ఒక యువతి పటవల పైడా కళాశాలలో 2017లో బీటెక్‌ పూర్తిచేసింది. అదే కళాశాలలో బీటెక్‌ చదివిన కాకినాడ జగన్నాయక్‌పూర్‌కు చెందిన గుదే రామ్‌భరత్‌ నాలుగేళ్లుగా ఆమెను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు.

15రోజుల క్రితం సదరు యువతికి వేరొకరితో నిశ్చితార్థం జరిగింది. ఇది తెలుసుకున్న రామ్‌భరత్‌ జగన్నాయక్‌పూర్‌కు చెందిన దిమిలి సూర్యప్రకాష్‌, ఘాటీసెంటర్‌కు చెందిన డోకుబుర్ర విజయరాజు అనే స్నేహితు లతో కలిసి గురువారం సాయంత్రం వ్యాగన్‌ -ఆర్‌(ఏపీ05ఈబీ 7849) కారులో పెనుగుదురు రామాలయంవీధిలో ఉంటున్న యువతి ఇంటికి వెళ్లారు.

ముగ్గురూ ఇంట్లోకి అక్రమంగా చొరబడి కత్తితో చంపుతామని బెదిరించారు. ఈ క్రమంలో రామ్‌భరత్‌ కత్తితో తన ఎడమచేతిని కోసుకుని బెదిరించాడు. దీంతో హడలిపోయిన ఆ యువతి పెద్దపెట్టున కేకలు వేయడంతో ముగ్గురు యువకులు కారులో పారిపోయారు.

అమ్మాయి అరుపులు విన్న స్థానికులు వారి కారును వెంబడించినా ఫలితం లేకపోయింది. బంధువుల సాయంతో బాధితురాలు శుక్రవారం కరప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిపై నిర్భయ చట్టంతోపాటు 354, 448 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్టు స్టేషన్‌ రైటర్‌ ఎన్‌.వెంకటరమణ తెలిపారు.