//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పునరాగమనాన్ని గెలుపుతో ప్రారంభించిన 'షరపోవా'

Category : sports

డోపింగ్‌ కారణంగా ఏడాదిన్నర నిషేధానికి గురై 15 నెలలు సస్పెన్షన్ అయినా రష్యా టెన్నిస్‌ తార మేరియా షరపోవా తిరిగి బుధవారమే మైదానంలోకి అడుగుపెట్టింది. 15 నెలలు తరువాత తన పునరాగమనాన్నిప్రారంభించిన షరపోవా మైదానంలో చత్తా చాటింది. స్టట్‌గార్ట్‌ డబ్బ్యూటీఏ తొలి రౌండ్లో ఆమె ప్రపంచ 36వ ర్యాంకర్‌ రాబర్టా విన్సిని 7-5, 6-3తో ఓడించింది. ఈ మ్యాచ్‌ గంటా 45 నిమిషాల పాటు ఆసక్తికరంగా సాగింది.వీరిరువురు తొలి రౌండ్లో హోరాహోరీగా తలపడగా. రెండో గేమ్‌లో సర్వీస్‌ కోల్పోయింది షరపోవా.. తర్వాతి గేమ్‌లోనే బ్రేక్‌ పాయింట్‌ సాధించింది. ఐతే 11వ గేమ్‌లో బ్రేక్‌ సాధించి.. తర్వాతి గేమ్‌లో సర్వీస్‌ నిలబెట్టుకున్న షరపోవానే సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో తొలి గేమ్‌లోనే బ్రేక్‌ పాయింట్‌ సాధించి ఆ తర్వాత అదే జోరు కొనసాగించి సెట్‌ను, మ్యాచ్‌ను గెలుచుకుంది.