//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అందరు చూస్తుండగా రోడ్ మీద 40 సార్లు పొడిచి చంపాడు.....!

Category : national

ప్రేమ పేరుతో జరిగే దారుణాలు అన్ని ఇన్ని కావు.ప్రాణం పోయాల్సిన ప్రేమ,ఈరోజుల్లో ప్రాణాలను తీసేస్తుంది.ప్రేమించలేదని ఒక యువతిని దారుణంగా చంపాడు ఒక యువకుడు.వివరాలలోకి వెళ్తే,

తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిని 40 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.చెన్నై శివారులోని మధురవాయిల్‌కు చెందిన అశ్విని కే.కే.నగర్ లోని మీనాక్షి కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతోంది. మధురవాయిల్ లోనే ఉంటున్న అళగేశన్ గత కొన్ని నెలలుగా అశ్వినిని ప్రేమ పేరుతో వేధిస్తూ ఉన్నాడు.

తనకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా అళగేశన్ వినిపించుకోలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది అశ్విని. పోలీసులు అళగేశన్‌ను అరెస్టు చేశారు. ఆ తరువాతైనా అళగేశన్ సైలెంట్ అయిపోతాడని అనుకుంది అశ్విని. కానీ అతనే తన ప్రాణాన్ని తీస్తాడని ఊహించలేకుండా పోయింది.

తనను ప్రేమించకపోగా.. పోలీసులతో కొట్టిస్తావా అంటూ కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న అశ్వినిని నడి రోడ్డుపై 40 సార్లు కత్తితో పొడిచాడు. స్థానికులు చూస్తుండగా అళగేశన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.