//single page style gallary page

A case against cyber criminals has been registered in the case against ten persons who have made remarkable comments on the case

Category : editorial

Click here to read this article in Telugu

సైబర్ నేరగాళ్ల పై చిరు చిన్నల్లుడు కేసు ....తన పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆ పది మంది పై కేసు నమోదు....!

మెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి అందరికీ తెలిసిందే....స్వతహాగా కళ్యాణ్ దేవ్ ఓ ఎన్నారై బిజినెస్ మేన్.అయితే ఈ ఎన్నారై కుర్రాడు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను 2016లో పెళ్లి చేసుకున్నాడు. ఈ విహాహం శ్రీజకు రెండో మ్యారేజ్ అయినప్పటికీ ఈ ఇద్దరు వివాహం తరువాత ఎంతో అనొన్యం గా ఉంటున్నారు. అలాగే ఈ జంటకు ఒక సంతానం కూడా ఉంది. శ్రీజ తొలుత శిరీష్ భరద్వాజ్ ని ప్రేమించి పెళ్లాడిన ఆ తరువాత ఈ ఇద్దరి మద్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.ఈ విషయం పక్కన పెడితే రీసెంట్ గా కళ్యాణ్ దేవ్ సినిమాల్లోకి కూడా విజేత అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపధ్యంలోనే ఈ హీరో పై సోషల్ మీడియాలో అతని పై దుర్బషలాడుతు కొంత మంది ఆయన్ని టార్గెట్ చేస్తూ ఉండడం.

గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాలలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఓ సాధనం గా మారిపోయింది.ఈ సమయంలోనే సైబర్ క్రైమ్ అంతకంతకు పెరుగిపోతుంది. ట్విట్టర్,ఇన్ స్టా,ఫేస్ బుక్ లాంటి మాధ్యమాల్లో సెలబ్రిటీలపై కారుకూతలు కూయడం, బూతులు తిట్టడం లేదా వ్యక్తిగతంగా కించపరుస్తూ కామెంట్స్ చేయడం వంటివి సర్వ సాధారణంగా మారాయి. అయితే అలా ఇష్టానుసారం ప్రవర్తిస్తే వారు కట కటల పాలు కాక తప్పదని సైబర్ క్రైమ్ చట్టాలు చెబుతున్నాయి. ఈ విషయంలో చట్టం ఎంతో సీరియస్ గా ఉందని ఈ తాజా ఉదంతం చెబుతోంది.

సోషల్ మీడియా ద్వారా తనని.. తన కుటుంబాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా వేదిస్తున్నారని కళ్యాణ్ దేవ్ మూడు రోజుల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయమై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళ్యాణ్ దేవ్ పై అసభ్యంగా ప్రవర్తించిన వారి పై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైమ్ వింగ్ పూర్తి వివరాల పై కూపీ లాగుతోంది. సమాచార హక్కు చట్టం "సెక్షన్ 67 " ప్రకారం మొత్తం పది మందిపై కేసులు పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్ల ఐపీ అడ్రస్ ల ఆధారంగా వారిని కనిపెట్టే పనిలో ఉన్నారు. చూడాలి మరి వాళ్ళు పట్టు బడితే వారి పై చట్టపరంగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది.

Mega Star Chiranjeevi Kaliyullu Kalyan Dev ... Kalyan Dev is a non-business business man. However, the NRI was married to the youngest daughter of Chiranjeevi, Shrija in 2016. Though this marriage is the second marriage for Srija, this couple is unmistakable after marriage. This couple also has a child. After the marriage, Sridevi first married Sirsish Bharadwaj and got separated from the two of them. Kalyan Dev has also come up with a film called Vijeta. In this setting, some of the victims of social media on the hero are some of his targets.

Social media has become an instrument for everyone, because of the revolutionary changes in social media over the past few years. Cybercrime is becoming increasingly dominant. In the media such as Twitter, InStage, Face Book, caricatures on celebrities, boiling or blasphemy are generally more common. Cyber crime laws say that if they do so, they will not be a leap of leaflets. The latest stating that the law is very serious in this regard.

Kalyan Dev, three days ago, complained to the Cyber Crime Police of Hyderabad that he was trying to spread his family to social media platform through social media. Police investigated the case and investigated the case. The coupe is being dragged on cyber crime wing details of cases registered against the victims of Kalyan Dev. It has been reported that ten persons have been charged under the Right to Information Act, Section 67. Currently they are working on finding them based on IP addresses. They will have legal action against the police.