//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడికి షాక్ ఇచ్చిన తెలంగాణా వ్యక్తి

Category : national state

పెట్రోల్ ధరలు పెంచే సమయంలో రూపాయల్లో పెంచుతూ తగ్గించే సమయంలో మాత్రం పైసల్లో తగ్గిస్తూ ఉంటారు. దీనిపై దేశ వ్యాప్తంగా విపక్షాలతో సహా సామాన్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సామాన్యులు అంటే చులకన అని అందుకే ఇలా వెటకారంగా స్పందించారని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి వినూత్నంగా స్పందించాడు.

ప్రధాని నరేంద్ర మోడికి 9 పైసల చెక్ పంపించి సంచలనం సృష్టించాడు. పెట్రోల్ ధరలు 9 పైసలు తగ్గించడంపై చందు గౌడ్ అనే వ్యక్తి ఈ విధంగా స్పందించాడు. ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు 9 పైసలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు నేరుగా చెక్ అందజేశాడు. ఈ 9 పైసలతో బీదలైన ధనవంతులకు ఏదైనా సహాయం చేయాలని చెప్పి చందు గౌడ్ కోరారు.