Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బస్సును దొంగిలించిన 9 ఏళ్ల అబ్బాయి

Category : world

సైకిళ్లు.. బైక్‌లు, కార్లను దొంగిలించడం చూశాం.. కానీ ఈ 9 ఏళ్ల అబ్బాయి మాత్రం ఏకంగా బస్సునే దొంగిలించేశాడు. చైనాకు చెందిన బాలుడు బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సును దొంగతనం చేశాడు. బస్సెక్కిన అబ్బాయి.. ధైర్యంగా బస్సును నడుపుకుంటూ 40 నిమిషాలు చక్కర్లు కొట్టాడు. సుమారు 10 కిలోమీటర్ల మేర బస్సును నడిపిన బాలుడు ఏ ఒక్కరిని ఢీకొట్టలేదు. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి.. బాలుడు బస్సు నడపడం చూసి వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అబ్బాయి బస్సు నడుపుతున్న విషయాన్ని పోలీసులకు దృష్టికి తీసుకెళ్లారు పాదాచారులు. జీపీఎస్ ద్వారా బస్సు ఎక్కడుందో తెలుసుకున్న పోలీసులు.. బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అబ్బాయి బస్సును ఎందుకు దొంగిలించాడో తెలియడం లేదు.

Related News