దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల కంపెనీలు కార్పొరేట్ శాఖలో రిజిస్టర్ అయి ఉండగా.వీటిలో దాదాపు 9లక్షల రిజిస్టర్ కంపెనీలు కార్పొరేట్ వ్యవహారాల శాఖకు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయటంలేదంటా.దిల్లీలో జరిగిన ఎన్ఫోర్స్మెంట్ డే కార్యక్రమంలో రెవెన్యూ సెక్రటరీ హష్ముఖ్ అదియా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 15 లక్షల కంపెనీలు కార్పొరేట్ శాఖలో రిజిస్టర్ అయి ఉన్నాయి. వీటిలో 8 నుంచి 9 లక్షల కంపెనీలు తమ వార్షిక పన్ను రిటర్న్స్‌ను దాఖలు సమర్పించలేదు.అంతేకాదు వీటి వల్ల మనీలాండరింగ్ జరిగే ప్రమాదం ఉంది కంపెనీలు రిజిస్టర్ అయిన తర్వాత పన్ను వివరాలను చెప్పకపోతే వాటిని మనీలాండరింగ్‌కు బలమైన సోర్స్‌లుగా పేర్కొనాల్సి ఉంటుందని అదియా అన్నారు. ఈ కంపెనీలను ప్రతి 15 రోజులకొకసారి పర్యవేక్షిస్తున్నామని, వీటిలో కొన్ని కంపెనీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు హష్ముఖ్ అదియా తెలిపారు.