//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశవ్యాప్తంగా 800 ఇంజనీరింగ్‌ కాలేజీల మూత

Category : national

వచ్చే విద్యా సంవత్సరం దేశ వ్యాప్తంగా 800 కళాశాలలు మూతపడనున్నాయి. వీటిల్లో  తెలుగు రాష్ట్రాల్లో 93 కళాశాలలు మూతపడనున్నాయి. ఎపిలో 29, తెలంగాణలో 64 ఇంజనీరింగ్‌ కళాశాలలు వాటిలో ఉన్నాయి. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరేవారి సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గిపోయింది. కొన్ని కళాశాలల్లో కనీస విద్యార్థులు కూడా చేరడం లేదు. అలాంటి వాటిని మూసివేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఎఐసిటిఇ) నిర్ణయించింది.

దేశ వ్యాప్తంగా 10,361 ఇంజనీరింగ్‌ కళాశాలలుండగా, వాటిలో వచ్చే ఏడాది 800 కళాశాలలకు తాళాలు పడనున్నాయి. ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు లేకపోవడం, మౌలిక వసతులు కల్పించడంలో యాజమాన్యాలు విఫలమవ్వడం తదితర కారణాలతో వీటి అనుమతులను ఎఐసిటిఇ రద్దు చేయనుంది. ఏటా ఇప్పటికే 150 కళాశాలలు స్వచ్ఛందంగానే మూతపడుతున్నాయి.

గత ఐదేళ్లుగా 30 శాతం కంటే తక్కువ ప్రవేశాలున్న కళాశాలల యాజమాన్యాలు స్వచ్చందంగా మూసి వేయాలని, లేదంటే సమీప కళాశాలల్లో విలీనం కావాలని ఎఐసిటిఇ సూచించింది. 2018-19 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని పేర్కొంది.  అడ్మిషన్లపై సెప్టెంబర్‌ రెండో వారంలోగా నివేదిక ఇవ్వాలని కళాశాలలకు తెలిపింది.