చైనాలోని వ్యాంగ్డంగ్ ప్రావిన్స్ పరిధిలోని షోషైంగ్ శివారులో తెల్లవారుజామున సబ్వే పనులు జరుగుతోన్న సమయంలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. నిర్మాణంలో ఉన్న సబ్ వేకు దగ్గరలోనే ఈ రోడ్డు ఉంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గల్లంతయ్యారని అక్కడి అధికారులు చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆ మార్గంలో వాహన రాకపోకలు ఆగిపోయాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ను విడుదల చేశారు.