//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

76 ఏళ్ళ భామ్మ మాట..మనువడికి బాట..!

Category : world

76 ఏళ్ల వృద్ధురాలు రోజుకు 24 కిలోమీటర్ల నడక సాగిస్తూ గత నాలుగేళ్లుగా ఎంతో కష్టపడుతోంది.ఇదేదో ఆరోగ్యసంరక్షణ కోసం ఆవిడ నడుస్తున్నారేమో అనుకుంటే పొరబడినట్టే.ఎందుకంటే ఆ బామ్మ అంతలా శ్రమించడానికి ఓ బలమైన కారణం ఉంది.పక్షవాతంతో బాధపడుతున్న తన మనవడిని వీల్‌ఛైర్‌లో బడికి తీసుకెళ్లేందుకే ఆవిడ నడక వెనుక ఉన్న ప్రధాన కారణం.అసలు విషయంలోకి వెళ్తే.

చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన షియూయింగ్‌ అనే వృద్ధురాలికి జింగ్‌హోవెన్‌ అనే తొమ్మిదేళ్ల మనవడు ఉన్నాడు.రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే ఆ బాలుడికి సెరిబ్రల్‌ పక్షవాతం అనారోగ్య సమస్య వచ్చింది.అప్పటినుంచి హోవెన్‌ కదలలేడు,నిలబడలేడు.దీంతో అతను ఎక్కడికి వెళ్లాలన్నా వీల్‌ఛైర్‌లో ఎవరో ఒకరు తీసుకెళ్లాలి.ఈ నేపథ్యంలో ఆ బాలుడి తల్లిదండ్రులు విడాకులు తీసుకోగా తల్లి వేరేవ్యక్తిని పెళ్లిచేసుకొని వెళ్లిపోయింది.తండ్రి మాత్రం ఆ బాలుడి వైద్యం కోసం వేరే ప్రాంతానికి వెళ్లి డబ్బు సంపాదిస్తున్నాడు.దీంతో హోవెన్‌ బాధ్యతలు మొత్తం అతడి నానమ్మ షియూయింగ్‌ తీసుకున్నారు.

ఆ బామ్మ తన మనవడికి సేవలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది.అయితే ఆ బాలుడిని బాగా చదివించాలని భావించి ఇంటికి 1.86 మైళ్ల దూరంలో ఉన్న ఓ పాఠశాలలో చేర్పించింది.అలా నాలుగేళ్లుగా రోజూ ఉదయం,మధ్యాహ్నం,సాయంత్రం వేళ్లల్లో పాఠశాలకు తీసుకెళ్లి తీసుకొస్తోంది.అంటే రోజుకు సగటున 24 కి.మీ దూరం వీల్‌ఛైర్‌లో ఆ బాలుడిని తీసుకెళ్తూ తీసుకొస్తోంది.

అంతేకాక హోవెన్‌కి కావాల్సిన చికిత్సలు,ఇతర సేవలు మొత్తం ఆ బామ్మనే చూసుకుంటోంది.ఇంత కష్టపడుతున్నా తనకు మాత్రం ఏ ఇబ్బందీ లేదని,తన మనవడి చదువుకోసం ఎంతకైనా కష్టపడుతానని చెబుతోంది.తన శరీరంలో శక్తి ఉన్నంత వరకు హోవెన్‌ని పాఠశాలకు తీసుకెళ్తానని సంతోషంగా అంటున్నారు షియూయింగ్‌.

Related News