//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

75 ఏళ్ల వృద్ధురాలి మీద 21 ఏళ్ల యువకుడు అత్యాచారం !

Category : national

కామా తురాణాం.. నభయం.. నలజ్జా అను ఊరికే అనలేదు అనిపిస్తుంటుంది ఇలాంటి వ్యక్తులను చూస్తుంటే. వయసుతో.. వరసతో పని ఏముంది... ఆడది ఐతే చాలు.. అత్యాచారం చేయడానికి... ఇక తాగిన మైకంలో ఓ వృద్ధురాలి పై అత్యాచారం చేయడమే కాదు..అనతరం ఆమెను హతమార్చాలని చూశాడు. తలపై బాది తీవ్ర గాయం చేశాడు..

ఈ ఘటన మైలార్ దేవుపల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకొన్నది. వివరాల లోకి వెళితే మధుబన్ కాలనీలో 75 ఏళ్ల వృద్ధురాలు నివశిస్తుంది.. ఆ వృద్ధురాలికి కల్లు తాగే అలవాటు ఉంది.. ఈ నేపథ్యంలో ఫుల్ గా కల్లు తాగి ఇంట్లో ఒంటరి గా ఉన్న సమయంలో స్థానికంగా ఉండే వంశీ అనే 21 యువకుడు ఆ వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. అనంతరం తన గురించి అందరికీ తెలుస్తుంది అని భయపడి.. ఆమెను చంపాలని భావించి.. గొడ్డలితో తలపై కొట్టి పరారయ్యాడు.

అయితే రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసిన బాధితురాలి కొడుకు ఆమెని ఆసుపత్రికి తరలించాడు..ఆ పై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు వంశీ అని గుర్తించారు.. అదుపులోకి తీసుకొని విచారణ చేయగా... తానే ఆ వృద్ధురాలిపై అత్యాచారం చేసి.. హత్యాయత్నం చేసినట్లు అంగీకరించాడు.. వంశీ గతంలో కూడా ఇటువంటి దారుణ ఘటనలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.