Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మెక్సికోలో మరో భారీ భూకంపం

Category : world

మెక్సికోలో వారం రోజుల క్రితమే భారీ భూకంపం సంభవించింది. అప్పటి ప్రమాదంలో 90 మంది వరకు చనిపోయారు.ఇప్పుడు మరో భారీ భూకంపం సంభవించింది. ఈ పకృతి విలయంతో ఇప్పటి వరకు 139 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1 మాగ్నిట్యూడ్‌గా నమోదయ్యింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం సెంట్రల్ మెక్సికోలో సంభవించిన ఈ భూకంపం దాటికి భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. దీంతో జనం బెంబేలెత్తిపోయారు. భయంతో పరుగులు తీశారు. ఇంకా శిథిలాల కింద అనేక మంది ఉన్నట్లు తెలుస్తోంది. మెక్సికో ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. కాగా, ప్యూబ్లా రాష్ట్రంలోని రబోసో నగర సమీపంలో భూకంప కేంద్రం నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

Related News