//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కల్పిత కధనంతో 67 మంది వీర సైనికులపై దారుణంగా `గూఢచారి' ముద్ర

Category : national

మేజర్ నిర్మల్ అజ్వాని పూర్తి సాక్ష్యాధారాలతో, దిగ్బ్రాంతి కలిగించే నిజాలతో రచించిన "ఒక తప్పుడు గూఢచారి" గ్రంధం వచ్చే నెల విడుదల కానున్నది. బహుశా భారత సైన్యం చరిత్రలోనే అత్యంత దారుణమైన, మొత్తం జాతి సిగ్గుతో తలవంచుకో వలసిన ఉదంతం వెలుగులోకి రానున్నది. 

పాకిస్తాన్ సైన్యం మన గూఢచారి అని ముద్రవేసి ఉరి శిక్ష విధించిన కులభూషణ్ జాదవ్ గురించి కాదు. మేజర్ అజ్వాని తో సహా తప్పుడు ఆరోపణలతో 1978లో  కోర్ట్ మార్షల్ జరిపి మన వీర సైనికులు 67 మందిని దారుణంగా శిక్షించిన వైనం గురించి ఇందులో వివరించారు. 

ఆగష్టు 1978 నుండి జనవరి 1979 వరకు ఆరు నెలల సమయంలో 67 మంది సైనికులను సైనిక నిఘా విభాగం అధికారులు వారు పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తున్నారనే కల్పిత ఆరోపణలతో అరెస్ట్ చేశారు. దానినే `సాంబ గూఢచారి కుంభకొణం' గా ప్రసిద్ధి చెందింది. 

కొద్దిమంది నేర స్వభావం గల భారత సైనిక నిఘా అధికారులు తమ సొంత ప్రొమోషన్ల కోసం సృష్టించిన కల్పితమైన  ఈ గూఢచారి కధనంతో వీరి జీవితాలను బలి తీసుకున్నారు. వీరిలో చాలామందిని చిత్ర హింసలకు గురిచేశారు. జైళ్లలో వేశారు. తమను ఈ కేసులో ఇరికించకుండా తప్పించు కోవడం కోసం తాము వత్తిడితో తప్పుడు సాక్ష్యాలు ఇచ్చామని కీలకమైన ప్రాసిక్యూషన్ సాక్షులు తరువాత బహిరంగంగా అంగీకరించారు కూడా. ఈ దుర్మార్గపు చర్య గురించి ఆ తర్వాత బలమైన సాక్ష్యాధారాలు కూడా వస్తున్నాయి.

చివరకు ఈ అంశం మిలిటరీ మార్షల్ నుండి సివిల్ కోర్ట్ కు చేరినప్పుడు ఢిల్లీ హై కోర్ట్ వారిలో ఇద్దరినీ నిర్దోషులుగా  ప్రకటించింది. దానితో ఇతరులపై కూడా కేసులు కొట్టివేసి మార్గం ఏర్పరిచింది. అయితే తాము వేసిన శిక్షలను రద్దు చేస్తే తమ `ఉన్నతాధికారం' నే సవాల్ చేసిన్నట్లు కాగలదని సైనిక ప్రధాన కార్యాలయం సుప్రీం కోర్ట్ నుండి  `సాంకేతిక కారణాలు'తో అనుకూల తీర్పు పొంద గలిగింది. దానితో మన వీర సైనికులకు నాలుగు దశాబ్దాలుగా ఘోరమైన అన్యాయం జరుగుతున్నది. 

నకిలీ సాక్ష్యాలు సృష్టించి అమాయకులను బలి చేశారని అంటూ వారి పక్షాన వాదించిన అనేకమంది నేడు ప్రభుత్వంలో కీలక పదవులలో ఉన్నారు. హై కోర్ట్ లో వారి తరపున న్యాయవాదిగా వాదించిన అరుణ్ జైట్లీ రక్షణ శాఖ మంత్రి గా ఉన్నారు. వారి తరపున వాదించిన న్యాయవాదుల బృందంలో ఉన్న ముకుల్ రోహత్గి నేడు అటార్నీ జనరల్. మనిందెర్ సింగ్ అదనపు సొలిసిటర్ జనరల్ గా ఉన్నారు. 

ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ గా జరిగిన పొరపాటును సరిదిద్దటం కోసం పోరాడిన అజిత్ దోయల్ నేడు జాతీయ భద్రతా సలహాదారుడు. వారందరు అమాయకులని తాను నమ్ముతున్నానని ఆయన మాజీ అధిపతి వి కె కౌల్ లిఖిత పూర్వకంగా స్పష్టం చేసారు. ఇప్పటికైనా ఈ ఘోరమైన అన్యాయాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం సరిదిద్దగలదా ?

Related News